NTV Telugu Site icon

R Krishnaiah: రాజ్యసభకు బీసీ ఉద్యమ నేత..! ఆర్‌. కృష్ణయ్య ఆనందం..

R Krishnaiah

R Krishnaiah

త్వరతోనే రాజ్యసభ ఎన్నికలు జరగబోతున్నాయి.. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ స్థానాలు ఖాళీగా ఉండగా.. అందులో ఒకటి బీసీ ఉద్యమ నేత ఆర్. కృష్ణయ్యకు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.. ఇక, ఆయన తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయానికి రావడంతో ఆ వార్తకు మరింత బలం చేకూరినట్టు అయ్యింది.. ఈ సారి విజయసాయిరెడ్డి, కిల్లి కృపారాణి, బీద మస్తాన్ రావు, ఆర్. కృష్ణయ్యను రాజ్యసభకు పంపాలని వైసీపీ అధినేత వైఎస్‌ జగన్‌ భావిస్తున్నట్టుగా తెలుస్తుండగా.. ఇవాళ సాయంత్రంలోగా అభ్యర్థులకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది. అయితే, ఈ పరిణామాలపై ఆనందం వ్యక్తం చేశారు ఆర్‌. కృష్ణయ్య

Read Also: Gold and Copper: నెల్లూరు జిల్లాలో బంగారు నిక్షేపాలు గుర్తింపు..

ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆర్ కృష్ణయ్య… నాకు రాజ్యసభ అవకాశం కల్పించటం ఆనందంగా ఉందన్నారు.. ఇది బీసీ ఉద్యమానికి, ఉద్యమకారుడిగా నాకు ఒక గౌరవం, గుర్తింపుగా భావిస్తానన్న ఆయన.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పెద్దపీట వేస్తున్నారని ప్రశంసలు కురిపించారు.. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ముఖ్యమంత్రి అభ్యర్థిగా నిలబెడతామని చెప్పి తర్వాత.. మళ్లీ టికెట్ ఇవ్వలేదని విమర్శించారు ఆర్‌. కృష్ణయ్య.. ఇక, బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాల్లోనూ బీసీలకు ఈ స్థాయిలో పదవులు కేటాయించలేదంటూ సీఎం వైఎస్‌ జగన్‌కు అభినందనలు తెలియజేశారు. కాగా, బీసీల సమస్యలపై సుదీర్ఘపోరాటం చేస్తున్న ఆర్‌. కృష్ణయ్య.. గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ప్రతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.

Show comments