Minister Nara Lokesh: కేజీ నుండి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తాం అన్నారు మంత్రి నారా లోకేష్.. బాపట్లలో మెగా పేరెంట్స్ టీచర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పిల్లల్లో నేను దేవుడ్ని చూస్తాను.. ప్రతి పిల్లవాడి అభివృద్ధి వెనుక వాళ్ల తల్లిదండ్రులు ఉంటారు.. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల అభివృద్ధి కోసం.. విద్యార్థుల తల్లిదండ్రులతో.. ఉపాద్యాయులతో కలిపి సమావేశం పెట్టాం అన్నారు.. పిల్లల ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెడుతున్నామన్న ఆయన.. గడిచిన ఐదేళ్లలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైపోయింది.. గాడి తప్పింది, అలా గాడి తప్పిన, విద్యాశాఖను గాడిలో పెట్టే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాకు అప్పగించారు.. ఇక పై విద్యా వ్యవస్థలో రాజకీయ జోక్యం లేకుండా చేస్తామన్నారు.. రాజకీయ నాయకుల ఫొటోలు స్కూల్ లో ఉండకూడదు, స్కూల్ బుక్స్ లో కూడా ఉండకూడదన్న ఆయన.. కేజీ నుండి పీజీ వరకు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేస్తాం అన్నారు..
Read Also: Amaravati Construction Work: అమరావతి రాజధాని పనుల పునఃప్రారంభం.. ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
ఇక, పాఠ్య పుస్తకాలలో మహిళలకు సముచిత గౌరవం ఇవ్వాలని సూచించారు మంత్రి లోకేష్.. నేను స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో చదువుకుని, కొన్ని విషయాలు నేర్చుకున్నాను అని గుర్తుచేసుకున్నారు.. పరీక్షా కేంద్రాల్లో.. టీచర్లు గానీ.. ఇన్విజిలేటర్లు గానీ అక్కడ ఉండరని తెలిపారు.. అయినా.. ఎవరూ పక్క వాళ్ల పేపర్ కోసం, కాపీయింగ్ కోసం చూడరన్నారు.. అలాంటి విద్య వ్యవస్థ ఇక్కడ కూడా రావాలని ఆకాక్షించారు.. ప్రభుత్వ విద్యావ్యవస్థ బాగుపడాలంటే.. మనం అంతా కలిసి పనిచేయాలన్నారు.. అందుకోసమే.. దేశంలో ఎప్పుడూ జరగని విధంగా.. మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు.. విద్యా వ్యవస్థకు టెక్నాలజీని జోడిస్తాం.. త్వరలోనే డిజిటల్ క్లాస్‌ను ప్రారంభిస్తామని తెలిపారు.. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..