NTV Telugu Site icon

Minister Anagani Satya Prasad: లోకేష్‌ నిర్మాణాత్మక చర్యలు.. కాలేజీల్లో హాజరు శాతం పెరుగుతుంది..!

Minister Anagani Satya Pras

Minister Anagani Satya Pras

Minister Anagani Satya Prasad: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఈ రోజు డొక్కా సీతమ్మ పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించింది ప్రభుత్వం.. విజయవాడలో ఈ పథకానికి మంత్రి నారా లోకేష్‌ శ్రీకారం చుట్టగా.. ఆయా జిల్లాలు, నియోజకవర్గాల్లో.. మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పథకాన్ని ప్రారంభించారు.. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.. ఇక, బాపట్ల జిల్లా రేపల్లె ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రారంభించారు రెవెన్యూ శాఖమంత్రి అనగాని సత్యప్రసాద్.. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదివే ఇంటర్ విద్యార్థులకూ నేటి నుంచి మధ్యాహ్న భోజనం అందించనున్నామని వెల్లడించారు..

Read Also: Minister BC Janardhan Reddy: ఎంతో మందికి అన్నం పెట్టిన మహాతల్లి డొక్కా సీతమ్మ.. ఆ పేరుతో పథకం ఆనందం..

మరోవైపు.. ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌పై ప్రశంసలు కురిపించారు మంత్రి అనగాని.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ హయాంలో దెబ్బతిన్న ఇంటర్మీడియట్ విద్యను బలోపేతం చేసేందుకు.. విద్యాశాఖ మంత్రి లోకేష్‌ నిర్మాణాత్మక చర్యలకు శ్రీకారం చుట్టారని, ఈ పథకం ద్వారా ప్రభుత్వ కళాశాలల్లో హాజరు శాతం పెరగటంతో పాటు, మంచి ఫలితాలు అందుతాయన్నారు.. అందుకోసమే మంత్రి నారా లోకేష్.. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ అన్నారు… విద్యార్థులకు మంచి పౌష్టిక ఆహారం అందించటమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు అనగాని సత్యప్రసాద్..

Show comments