Bapatla Resident Sai Commits Suicide Due To Loan App Harassment: లోన్ యాప్ వేధింపుల కారణంగా ఇప్పటికే ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. తీసుకున్న డబ్బులు వడ్డీతో తిరిగిచ్చినా.. లోన్ యాప్ నిర్వాహకులు న్యూడ్ ఫోటోలు పంపుతూ వేధింపులకు గురి చేస్తుండటంతో, బాధితులు ఆ అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నారు. తమ బాధని ఎవరితో చెప్పుకోవాలో తెలియక.. బలవన్మరణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఓ యువకుడు కూడా లోన్ యాప్ వేధింపులు భరించలేక.. సూసైడ్ చేసుకున్నాడు. గత రెండేళ్ల నుంచి తనని హింసిస్తుండటంతో.. చావే శరణమని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వివరాల్లోకి వెళ్తే..
Prabhas: ‘సలార్’ క్లైమాక్స్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసేలా ఉండబోతుందా?
ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లాలో నివాసముంటున్న సాయి అనే యువకుడు.. రెండు సంవత్సరాల క్రితం తన వ్యక్తిగత ఆర్థిక అవసరాల కోసం లోన్ యాప్స్ నుంచి రూ.50 వేలు రుణం తీసుకున్నాడు. అతడు రూ.40 వేల వరకు తిరిగిచ్చేశాడు. అయితే.. మరో రూ.50 వేలు కట్టాలని లోన్ యాప్ నిర్వాహకులు డిమాండ్ చేశారు. లేకపోతే న్యూడ్ ఫోటోలు వైరల్ చేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. తన వద్ద డబ్బులు లేవని, తనకు కొంత సమయం ఇవ్వాలని, వడ్డీతో సహా తిరిగిచ్చేస్తానని చెప్పాడు. కానీ.. లోన్ యాప్ నిర్వాహకులు అతని మాట వినిపించుకోలేదు. డబ్బులు తీసుకున్నోడివి సమయానికి తిరిగి ఇవ్వాలని తెలీదా అంటూ వేధించసాగారు మొదలుపెట్టారు. అభ్యంతకరమైన సందేశాలు పంపుతూ.. అతడ్ని మానసికంగా కృంగదీశారు. న్యూడ్ ఫోటోలు ఎడిట్ చేసి, డబ్బులు తిరిగివ్వకపోతే ఆ ఫోటోల్ని వైరల్ చేస్తామని బెదిరించారు. ఇలా తనని రెండేళ్ల నుంచి వేధిస్తుండటంతో.. సాయి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Cannes Film Festival: కేన్స్ ఫెస్టివల్‌లో షాకింగ్ ఘటన.. ఒంటిపై రక్తం పోసుకొని..
ఈ విషయం తెలిసిన కుటుంబసభ్యులు సాయిని వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించి, చికిత్స అందించారు. ప్రాణాపాయ స్థితిలో అతడు లోన్ యాప్ వేధింపులు తాళలేక ఇలా సూసైడ్ చేసుకున్నానని లేఖ రాశాడు. గడిచిన రెండేళ్లుగా లోన్ యాప్‌లు తనని వేధిస్తున్నాయని, డబ్బులు కట్టలేని పరిస్థితుల్లోనే తాను ఆత్మహత్యాయత్నం చేశానని అందులో పేర్కొన్నాడు. అనంతరం చికిత్స పొందుతూ అతడు మృతి చెందాడు. మృతుడి బంధువుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.