NTV Telugu Site icon

Balineni Srinivasa Reddy: నాపై జగన్‌కి ఫిర్యాదు చేసినా భయపడను..!

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

ఏపీ మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు.. మూడేళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంజాయ్ చేశారు.. మిగిలిన రెండేళ్లు కార్యకర్తల్ని అక్కున చేర్చుకుని మంచి చేస్తే మరోసారి ఎమ్మెల్యేలు అవుతారన్న ఆయన.. లేక పోతే పుట్టగతులు కూడా ఉండవు అంటూ హెచ్చరించారు.. ఇక, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఎమ్మెల్యేలను సహించబోనంటూ వార్నింగ్‌ ఇచ్చిన బాలినేని.. ఈ విషయంలో నాపై సీఎం వైఎస్‌ జగన్ కి ఫిర్యాదులు చేసుకున్నా భయపడేదిలేదన్నారు.

Read Also: Telangana: సీడబ్ల్యూసీకి తెలంగాణ లేఖ.. ఆ రెండు ప్రాజెక్టులపై ఫిర్యాదు..

నాకు మంత్రి పదవి పోయినప్పుడు బాధపడ్డానని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. నేను గతంలో మంత్రి పదవి వదులుకుని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరానన్న ఆయన.. మంత్రి పదవి వదులుకుని వచ్చిన నాకు తిరిగి మంత్రి పదవి ఇవ్వలేదని బాధపడ్డాను అన్నారు.. ఇక, మూడేళ్లు ఎమ్మెల్యేలు, మంత్రులు ఎంజాయ్ చేశారు.. మిగిలిన రెండేళ్లు కార్యకర్తల్ని అక్కున చేర్చుకుని మంచి చేస్తే మరోసారిఎమ్మెల్యేలు అవుతారని సూచించారు. నేను మంత్రి పదవి అడిగాను.. కానీ, ఆదిమూలపు సురేష్ కి మంత్రి పదవి ఇవ్వొద్దని ఎప్పుడూ చెప్పలేదన్నారు బాలినేని. కాగా, వైఎస్‌ జగన్‌ 1 కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన బాలినేని.. జగన్‌ 2 కేబినెట్‌లో ఆ అవకాశాన్ని పొందలేకపోయిన విషయం తెలిసిందే.