Site icon NTV Telugu

Balineni Srinivas Reddy: వారిపై పరువునష్టం దావా వేస్తా

Balineniii

Balineniii

మంత్రి పదవి ఇవ్వకపోతే రాజీనామా చేస్తానంటూ వార్తలు వచ్చాయి. దాన్ని ఆరోజే ఖండించాను. మాపై ఇలాంటివి‌ రాసిన వారిపై పరువునష్టం దావా వేస్తా అని వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎం ఆలోచన ప్రకారమే పదవులు ఇస్తారు. మంత్రి పదవి కోసం ఎప్పుడూ నేను పాకులాడలేదు. ఆరోజు చెప్పగానే 24 మంది రాజీనామా చేశాం. మంత్రి పదవి లేనప్పుడు కొంచెం ఫీల్ అవటం ఎవరికైనా ఉంటుందన్నారు.

అంతకుమించి ఇంకేమీ లేదు. నేను వైయస్సార్ ఫ్యామిలీ మెంబర్ని. ఆదిమూలపు సురేష్ కి ఇస్తే నేను అలిగానని కూడా రాశారు . సురేష్, నేను కలిసి ఆ క్యాబినెట్ లో పనిచేసాం. ఇద్దరం వేర్వేరు శాఖలు నిర్వహించాం. పార్టీలో అతను ఎప్పుడూ అనవసరంగా జోక్యం చేసుకోలేదు. ఇద్దరం కలిసి పార్టీ అభివృద్ధికి పని చేస్తాం అన్నారు బాలినేని. మావాళ్లు కొందరు రాజీనామా లు చేసినా, అవన్నీ వెనక్కి తీసుకుంటాం. సీఎం ఎలాంటి బాధ్యతలు బాప్పగించినా నెరవేర్చుతానన్నారు.

https://ntvtelugu.com/atchannaidu-comments-on-jagan-cabinet/

సీఎం 23న ఒంగోలులో ఒక సమావేశానికి వస్తున్నారు. దాని గురించి చర్చించాం. కొత్త కేబినెట్ లో అందరూ సత్తా ఉన్నవాళ్లే. బీసీ, ఎస్సీలకు‌ ప్రయారిటీ ఇచ్చారు. పార్టీ కుటుంబం లాంటిది. అందరం కలిసి మెలిసి ఉండాలని నేను కోరుకుంటున్నా అన్నారు. ఇప్పుడు పదవులు రానివారు ఎవరూ బాధ పడాల్సిన పనిలేదు. అందరికీ ఒకేసారి పదవులు రావు. మిగతా వారంతా కలిసి కొత్తవారిని స్వాగతిద్దాం అన్నారు బాలినేని. ఆయన్ని సజ్జల సముదాయించారని, బుజ్జగించారని వార్తలు వచ్చాయి.

Exit mobile version