Balineni Srinivas Reddy : పిఠాపురం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం జగన్ తనకు తీవ్ర అన్యాయం చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ తన మంత్రి పదవి తీసేశాడని.. అయినా సరే తాను బాధపడలేదన్నారు. తనను జనసేనలోకి తీసుకొచ్చింది నాగబాబు అని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్ వెంట తాను నడుస్తానని.. ఎలాంటి పదవులు ఆశించి జనసేనలోకి రాలేదన్నారు. జనసేన కోసం ఒక మంచి కార్యకర్తగా పనిచేస్తానని వివరించారు.
Read Also : Ranya Rao Case: గోల్డ్ స్మగ్లింగ్ కేసులో రన్యా రావుకు ఎదురుదెబ్బ.. బెయిల్ తిరస్కరణ..
తన ఆస్తులు, తన వియ్యంకుడి ఆస్తులను మాజీ సీఎం జగన్ కాజేశారంటూ సంచలన ఆరోపణలు చేశారు. తన కుటుంబాన్ని జగన్ చాలా ఇబ్బంది పెట్టారని.. అందుకు చాలా బాధపడ్డట్టు చెప్పుకొచ్చారు. తనకు పవన్ అండగా ఉంటానని హామీ ఇచ్చారని.. పదవి వచ్చినా రాకపోయినా జనసేనలోనే ఉంటానని చెప్పుకొచ్చారు. తాను కూటమిని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్టు కొన్ని వార్తా పత్రికలు రాతలు రాశాయని.. కానీ అందులో నిజం లేదంటూ చెప్పుకొచ్చారు. పవన్ కల్యాణ్ కు చెడ్డపేరు వచ్చేలా తాను ప్రయ్నతించబోనని తేల్చి చెప్పారు.