NTV Telugu Site icon

Harvest India: హార్వెస్ట్ ఇండియాపై దుష్ప్రచారం

Harest

Harest

గత మూడు రోజులుగా హార్వెస్ట్ ఇండియా స్వచ్ఛంద సంస్థపై ద్రుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు గుంటూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ హెన్రీ క్రిస్టినా. యాభై ఏళ్ళ క్రితమే హార్వెస్ట్ ఇండియా సంస్థను స్థాపించారు. పేదలకు, అస్వస్థతతో ఉన్న వారికి, అనాధ పిల్లలకు సేవ చేయడమే ఈ సంస్థ లక్ష్యం. పదిహేను అత్యున్నత సేవా అవార్డులను అందుకున్నాం‌మన్నారు.

నా భర్త కత్తెర సురేష్ కుమార్ అరెస్టు అంటూ వార్తలు రాశారు. నా భర్త విదేశాల్లో ఉన్నారు. మాపై కొందరు కావాలనే కుట్ర చేస్తున్నారు. మూడేళ్ళ క్రితమే ఫెరా లైసెన్స్ నిలిపి వేసింది. ఫెరా లైసెన్స్ రెన్యూవల్ కోసం దరఖాస్తు చేసుకున్నాం. నిబంధనలకు లోబడే సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. సిబిఐతో పాటు ఇతర దర్యాప్తు సంస్థల విచారణకు సహకరిస్తాం. చట్టాలను, న్యాయ స్థానాలను గౌరవిస్తాం. నలభై యాభై మందిపై సీబీఐ కేసు నమోదు చేసింది. వారిలో నా భర్త పేరు కూడా ఉంది. ప్రభుత్వానికి తెలియకుండా విదేశాలకు చిన్న పిల్లల దత్తత చేయడం సాధ్యం కాదన్నారు హెన్రీ క్రిస్టినా.

KTR:2072 వ‌ర‌కు తాగునీటికి ఇబ్బందుల్లేకుండా ప్లాన్