Site icon NTV Telugu

భారతి సిమెంట్‌ రూ.100కే అమ్మండి: బుచ్చయ్య చౌదరి

ఏపీలో సినిమా టిక్కెట్ల విషయంలో దూమారం చేలరేగుతున్న విషయం తెల్సిందే..దీని పై తాజాగా టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరిఏసీ సీఎం జగన్‌ మోహన్‌రెడ్డికి కౌంటర్‌ ఇచ్చారు. ట్విట్టర్‌ వేదికగా ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ లో సిమెంట్ బస్తా రేటు కూడా ₹100 కి తీసుకొచ్చి.. దేశ చరిత్రలోనే నిజంగా చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోండి అంటూ ట్వీట్‌ చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

https://ntvtelugu.com/sensational-allegations-were-made-that-vangaveeti-radha-was-looking-to-assassinate-him/

సిమెంట్ బ్యాగ్ మీద మీ కమిషన్లు తగ్గించు కుంటే వాటి రేటు కూడా తగ్గుతాయని…పెద్ద హీరోలని తగ్గించుకోమన్నారు కదా… మీ కమిషన్ కూడా తగ్గించుకోవాల‌ని చుర‌క‌లు అంటించారు బుచ్చయ్య చౌదరి. అది కూడా మీ భారతి సిమెంటుతో మొదలు పెట్టి ఆదర్శంగా నిలవాల‌ని ఆయ‌న విమర్శించారు. అంతే కాకుండా ఉచితంగా ఇల్లు ఇస్తాము అని చెప్పి 5 బస్తాలు భారతి సిమెంటు ఖచ్చితంగా కొనాలి అనే దాంట్లో మర్మం కూడా ప్రజలకి చెప్పాలి ? అని ఎద్దేవా చేశారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.


Exit mobile version