మన రాష్ట్రం అధొగతిపాలైందని ప్రజలకూ తెలుసు అని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. ఎన్నికల ముందు చేసిన హామీలకు అధికారంలోకి వచ్చిన తర్వా చేస్తోన్న దానికి పొంతన వుందా… పరిశ్రమలు లేవు..మౌలిక వసతులు లేవు. కాగ్ రిపోర్ట్ ప్రకారం ఆదాయం తగ్గింది రాష్ట్రంలో. టిడిపి హయాంలో అప్పులు చేసి సంపద సృష్టికి ఉపయోగించాము. ఆదాయాన్ని పెంచే మార్గం చూపించాము. జగన్ చేసిన అప్పుల వల్ల ఎవరికి ప్రయోజనం చేకూరింది. 5నెలల్లో 8 వేల కోట్లు వడ్డీలే కట్టాల్సి వస్తోంది. మద్యపాన నిషేధం అని చెపుతూనే మద్య దుకాణాలను 25 ఏళ్లకు తాకట్టు పెడతారా అని ప్రశ్నించారు. కరెంటు చార్జీల్లో ట్రూ అప్ చార్జీలు ఎందుకు జోడించారు. టూరిజం మంత్రికి తెలీకుండా టూరిజం గెస్ట్ హౌస్ లు పడగొట్టెస్తారా. జగన్ దోచుకున్న డబ్బు హెట్రోలో దాచుకున్నారు..అదే తనిఖీల్లో బైటపడింది. అయ్యన్న పాత్రుడికు గంజాయ్ వ్యాపారంలో సంబంధం వుందని ఎలా ఆరోపిస్తారు. 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఒక్క సారైనా పోలీస్ రికార్డుల్లో నా పేరు వుందా అని అడిగారు. హోమ్ మంత్రి ఎలా నిరాధార ఆరోపణలు చేస్తారు. ఎవరి కనుసన్నల్లోనే గంజాయి రవాణా సాగుతోందో అందరికీ తెలుసు. మూలాల జోలికి ఎవ్వరూ వెళ్లడంలేదు ఎందుకు. పోలీసులు ఎందుకు నిర్లిప్తంగా వున్నారు. ఆరోపణలు నిరూపిస్తే రాజకీయాలు వదిలి ఇంట్లో కూర్చుంటాను అని ఛాలెంజ్ చేసారు.