NTV Telugu Site icon

Ayyanna Patrudu Issue:నర్సీపట్నంలో టెన్షన్.. టెన్షన్

Ayyanna

Ayyanna

నర్సీపట్నంలో వాతావరణం హాట్ హాట్ గా కొనసాగుతోంది. మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడను కూల్చేందుకు తీసుకుని వచ్చిన జేసీబీ అద్దాలు ధ్వంసం చేశారు. అనకాపల్లి నుంచి వస్తున్న జేసీబీని దుంగనవానిపాలెం దగ్గర అడ్డుకుని గాలి తీసేసి నిరసన తెలిపారు. అయ్యన్న ఇంటి దగ్గరే మకాం వేసిన అభిమానులు, టీడీపీ కార్యకర్తలు అధికారులను అడ్డుకుంటున్నారు. నర్సీపట్నంలో మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటికి చేరుకున్న బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణుకుమార్ రాజు పరిస్థితిని అడిగి తెలుసుకుంటున్నారు.

అయ్యన్నపాత్రుడి ఇంటిగోడ కూల్చివేత‌ ముమ్మాటికీ వైసీపీ క‌క్ష సాధింపు చర్యల్లో భాగమేనని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్న సంగతి తెలిసిందే.టీడీపీలో బ‌ల‌మైన బీసీ నేత‌ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు, అరెస్టులు, దాడుల‌కు జ‌గ‌న్‌ పాల్పడుతున్నారని బాబు మండిపడ్డారు. మరోవైపు నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర సర్వే ప్రారంభమైంది. అయితే ఈ సర్వేకు బ్రేక్ పడింది.

అయ్యన్నపాత్రుడు ఇంటి దగ్గర రెవెన్యూ శాఖ ప్రారంభించిన సర్వేకు బ్రేక్ వేశారు. జాయింట్ సర్వే చేయించాలని అయ్యన్న కుటుంబం కోరింది. ప్రభుత్వ, ప్రయివేట్ సర్వేయర్ల సమక్షంలో రేపు భూమి సర్వే నిర్వహించాలని అభ్యర్థించారు. జాయింట్ సర్వేకు జిల్లా యంత్రాంగం అంగీకారం తెలిపింది. పోలీసు భద్రత మధ్య భూమి కొలతలు తీస్తున్నారు రెవిన్యూ సిబ్బంది. రెండు సెంట్ల కాలువ భూమి ఆక్రమణలకు గురైనట్టు గుర్తించారు ఇరిగేషన్ అధికారులు. అయ్యన్న కుటుంబానికి మద్దతుగా మాజీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు నర్సీపట్నం తరలివస్తున్నారు.

అయ్యన్నపాత్రుడు వ్యవహారంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ల వరద సాగుతూనే వుంది. గంజాగాడి ఆక్రమణ అయ్యకు, కొడుక్కి లీగల్‌గా కనిపించింది. ఎన్టీఆర్‌ పార్టీనే కబ్జా చేసి, వ్యవస్థాపకుడిని హత్య చేసి, ఆ తరవాత భూకబ్జాలను టీడీపీ జాతీయ విధానంగా…పార్టీని తెలుగు దున్నల పార్టీగా మార్చేశాడు 73 ఏళ్ల ముసలోడు అంటూ ట్వీట్ చేశారు విజయసాయిరెడ్డి.

Karumuri Nageshwarrao:అయ్యన్న తప్పుచేస్తే చూస్తూ ఊరుకోవాలా?