NTV Telugu Site icon

Ayyanna Patrudu: ఏపీ సీఐడీ ఓవరాక్షన్ చేస్తోంది

Ayyana Patrudu

Ayyana Patrudu

ఏపీలో సోషల్ మీడియా వార్ నడుస్తోంది. టీడీపీ నేతలు చేసే సోషల్ మీడియా పోస్టులే టార్గెట్ గా సీఐడీ పోలీసులు కేసులు నమోదుచేస్తున్నారు. విజ‌య్ ఇంటిలో పోలీసులు దురుసుగా వ్యవ‌హ‌రించారంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్‌ అయ్యారు. విజ‌య్‌ని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసేందుకు ప్రయ‌త్నించార‌ని ఆయ‌న ఆరోపించారు. ఈ త‌ర‌హా ఘ‌ట‌న‌ల‌పై హైకోర్టు ఎన్ని సార్లు మంద‌లించినా జ‌గ‌న్ స‌ర్కారుకు బుద్ధి రావ‌డం లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.

Read Also: DASARA: ‘ధూమ్ ధామ్ ధోస్థాన్’ కోసం నాని మాసియెస్ట్ అవతార్!

మరోవైపు ఏపీలోని సీఐడీ పోలీసులు ఓవరాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు టీడీపీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు. ఏపీ సీఐడీ రూల్సును అతిక్రమించి ప్రవర్తిస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి ఇంట్లో చిన్న పిల్లలు లేరా..?నోటీసులు ఇవ్వకుండా హైదరాబాద్ లోని తన కొడుకు ఇంటికి సీఐడీ అధికారులు ఎలా వస్తారు..? ఏపీ సీఐడీ పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారు. చట్ట ప్రకారం వస్తే ఎవరైనా సహకరిస్తారు. ఏపీలో రాక్షస ప్రభుత్వం నడుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే కేసులు పెడతారా? అని ఆయన ప్రశ్నించారు.

నేను ఎప్పుడు తప్పు చేయలేదు. బెదిరిస్తే వెనక్కి తగ్గే వాళ్లం కాదు. పార్టీ కోసం ఎంతకైనా తెగిస్తాం. గతంలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఇంటి గోడను పడగొట్టారు. జగన్ దోపిడీని ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలా..? ఇంట్లో యజమానులు లేని సమయంలో ఆడవాళ్లను, చిన్న పిల్లలను బెదిరిస్తారా..? జనం జగన్‍పై తిరుగుబాటు చేసే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.ఏపీలో పోలీసు వ్యవ‌స్థను జ‌గ‌న్ రాజ‌కీయ క‌క్షసాధింపుల కోసం వినియోగిస్తున్నార‌ని ఆయ‌న ధ్వజ‌మెత్తారు.

Read Also: Chintakayala Vijay: చింతకాయల విజయ్ ఇంట్లో ఏపీ సీఐడీ సోదాలు