NTV Telugu Site icon

Ayyanna Patrudu: అవంతికి అయ్యన్న కౌంటర్.. రాసలీలల ఆడియో తప్ప..!?

Ayyanna Patrudu

Ayyanna Patrudu

చంద్రబాబుకి అమరావతి మీదే ప్రేమ.. విశాఖకు పరిపాలన రాజధాని చంద్రబాబు వద్దంటే.. ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? ఫైర్‌ అయిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్‌కు కౌంటర్‌ ఇచ్చారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు.. సోషల్‌ మీడియా వేదికగా తాజా మాజీ మంత్రి అవంతికి కౌంటర్‌ ఇస్తూ.. విశాఖని రాజధానిగా ప్రకటించిన తరువాత అవంతి గారి రాసలీలల ఆడియో విడుదల తప్ప ఏమైనా జరిగిందా..? విశాఖ అభివృద్ధికి అదనంగా ఒక్క రూపాయైనా వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిందా? అని నిలదీశారు.

Read Also: Chandrababu: పొత్తులపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

పదవి పోయాక అవంతికి పరువు కాపాడుకోవడానికి ఉత్తరాంధ్ర గుర్తొచ్చిందా? అంటూ సెటైర్లు వేశారు అయ్యన్నపాత్రుడు.. మంత్రిగా ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర అభివృద్ది కోసం ఒక్క రూపాయి కూడా ఎందుకు కేటాయించడం లేదని సీఎం వైఎస్‌ జగన్‌ని నిలదీసే ధైర్యం చేయని అవంతికి ఇప్పుడు ఉత్తరాంధ్ర ప్రజలు గుర్తొచ్చారా..? అని మండిపడ్డారు. కాగా, నిన్న విశాఖలో పర్యటించిన టీడీపీ అధినేత చంద్రబాబు.. అమరావతిని రాజధానిని చేస్తాం… విశాఖను అభివృద్ధి చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.