కైకలూరు జూన్ 26:-మానవత్వం తో కూడిన వైద్య సేవలు మహోన్నతమని కైకలూరు శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఆదివారం ఇక్కడి జిల్లాపరిషత్ ట్రావెలర్స్ బంగ్లా లో హైదరాబాద్ కు చెందిన ఎవిస్ హాస్పిటల్స్. కైకలూరు ప్రెస్ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదలకు సేవలు అందించేందుకు పాత్రికేయులు ముందుకు రావడం ముదావహమన్నారు. వైద్యులు మనకి కనిపించే దేవుళ్ల ని కొనియాడారు. ప్రణాళిక ప్రకారం ఈ ప్రాంతీయులకు ఇటువంటి సేవలు అందించాలని తాము కూడా సహకరిస్తామని నాగేశ్వరరావు హమీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎంపిపి అడవి వెంకట కృష్ణ. సర్పంచ్ దానం మేరీ నవరత్న కుమారి. సబ్ ఇన్స్పెక్టర్ షణ్ముఖ సాయి.ప్రముఖులు కట్ట నాగరాజు గౌడ్.జయ మంగళ ఎవిస్ వైద్యులు గణేష్ రుద్ర. మారన్. కైకలూరు ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఏ. వి. శ్రీనివాసరావు. ఎవిస్ హాస్పిటల్స్ కోఆర్డినేటర్ అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. ఈ శిబిరంలో సుమారు 150 మందికి ఉచిత వైద్య సేవలు. ఉచితంగా మందులు అందజేశారు.
