Site icon NTV Telugu

CM Chandrababu: ఏపీలో కొత్త పథకం.. ఆటోలో ప్రయాణించిన సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్

Auto

Auto

CM Chandrababu: ఏపీలో కూటమి ప్రభుత్వం సంక్షేమం దిశగా మరో అడుగు వేసింది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని డ్రైవర్ల సంక్షేమం కోసం ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో సొంత ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు ఆర్థికంగా అండగా నిలబడేందుకు కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని తీసుకొచ్చింది. కాగా, ఈ పథకాన్ని ప్రారంభించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ ఉండవల్లి నుంచి ఆటోల్లో సింగ్ నగర్ బయలుదేరారు.

Read Also: CJI Gavai: న్యాయ వ్యవస్థ బుల్డోజర్లతో కాదు.. చట్టబద్ధంగా సాగుతోంది.. సీజేఐ గవాయ్ కీలక వ్యాఖ్యలు

అయితే, ఉండవల్లి దగ్గర సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మాధవ్ లకు మంగళగిరి చేనేత కండువాలు కప్పి మంత్రి నారా లోకేష్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంగళగిరి ప్రజలు అందరినీ లోకేష్ ఆత్మీయంగా పలకరించారు. బాణాసంచా, తీన్ మార్ డ్యాన్స్ లో మంగళగిరి యువత సందడి చేశారు. విజయవాడ సింగ్‌ నగర్‌లోని మాకినేని బసవపున్నయ్య స్టేడియంలో ‘ఆటో డ్రైవర్ సేవలో’ పథకాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించే ‘ఆటో డ్రైవర్‌ సేవలో’ పథకo ప్రారంభోత్సవంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, బీజేపీ చీఫ్ మాధవ్ పాల్గొన్నారు.

Read Also: Jagtial Bride Suicide: చిన్న గొడవ.. పెళ్లైన వారం రోజులకే ఆత్మహత్య చేసుకున్న నవ వధువు..

ఇక, ఆటో డ్రైవర్లకు రూ. 15 వేల ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించనుంది. ఒక్కో డ్రైవర్‌కు ఏడాదికి రూ. 15 వేలు చొప్పున ఆర్థికంగా ఆదుకోనుంది. తొలి ఏడాది 2,90,669 మంది డ్రైవర్లకు రూ.436 కోట్ల మేర డబ్బులను వారి ఖాతాల్లో జమ చేయనుండగా.. ఆటో డ్రైవర్లు 2.64 లక్షల మంది, ట్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు 20,072 మంది, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు 6,400 మందికి లభ్ది చేకూరనుంది. అయితే, ఎన్నికల సమయంలో హామీ ఇవ్వనప్పటికీ ఆటో డ్రైవర్లకు సాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.

Exit mobile version