Site icon NTV Telugu

Auto Driver Selfie Video: సెల్ఫీ వీడియో తీసుకుని ఆటోడ్రైవర్ ఆత్మహత్య

Auto Driver Suicide

Auto Driver Suicide

Auto Driver Selfie Video: ఇటీవల కాలంలో సెల్ఫీ వీడియోలు తీసుకుంటూ పలువురు ఆత్మహత్యలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా భార్య, అత్త వదినల వేధింపులు భరించలేక ఆటో డ్రైవర్ సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆత్మహత్య చేసుకున్న సంఘటన అన్నమయ్య జిల్లా మదనపల్లి సమీపంలో చోటుచేసుకుంది. మదనపల్లి సీటీఎం మార్గంమధ్యలోని ఎర్రగన్నమిట్ట వద్ద నివాసం ఉండే ఆటో డ్రైవర్ రమేష్‌కు రెండేళ్ల క్రితం శ్రీలత అనే యువతితో వివాహమైంది. పెళ్లి అయినప్పటి నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయి. శ్రీలత ఆమె తల్లి అక్కల మాటలు వింటూ భర్తను పట్టించుకోలేదు.

Read Also: Vizag Zoo Park: బరితెగించిన యువకులు.. పందుల ఎన్‌క్లోజర్‌లోకి దూకి..

ఈ విషయమై పలుమార్లు రమేష్ భార్య అత్త వదినలతో గొడవలు పడిన అతని సంసారం బాగుపడలేదు. దీంతో ఐదు రోజుల క్రితం రమేష్ పురుగుల మందు డబ్బా తీసుకుని సమీపంలోని గుట్టల్లోకి వెళ్లి మొబైల్‌లో సెల్ఫీ వీడియో ఆన్ చేసి పురుగుల మందు డబ్బా ఓపెన్ చేసి దానిని తాగుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఐదు రోజులైనా రమేష్ కనపడకపోవడంతో పాటు సమీపంలోని గొర్రెల కాపరులు అతడి మృతదేహం చూసి పోలీసులు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న మదనపల్లి తాలూకా పోలీసులు రమేష్ మృతదేహం వద్ద పడి ఉన్న మొబైల్ ఫోను పరిశీలించగా సెల్ఫీ ఆత్మహత్య వీడియో బయటపడి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తాలూకా సీఐ సత్యనారాయణ పేర్కొన్నారు.

Exit mobile version