NTV Telugu Site icon

Train Robbery: పల్నాడులో వరుస రైలు దోపిడీలు.. రంగంలోకి రైల్వే పోలీసులు..!

Tarin

Tarin

Train Robbery: పల్నాడు జిల్లాలో వరుసగా జరుగుతున్న రైలు దోపిడీలతో రైల్వే ప్రయాణికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. శనివారం తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద చెన్నై ఎక్స్ ప్రెస్ చైన్ లాగి మరి దోపిడీకి దుండగులు పాల్పడ్డారు. అర్ధరాత్రి మహిళలు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా రైలు ఆగిపోవడంతో.. వెంటనే దుండగులు మహిళలపై దాడి చేసి మెడలో ఉన్న చైన్లు లాక్కుని వెళ్ళటం జరిగిపోయింది. ఇక, ఈ చోరీ జరిగిన తర్వాత సికింద్రాబాద్ చేరుకున్న మహిళలు అక్కడ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Read Also: Donald Trump : డొనాల్డ్ ట్రంప్ అంతర్గత సందేశాలు హ్యాక్.. ఇరాన్‌ హ్యాకర్లే చేశారని ప్రచారం

అయితే, ఈ ఘటన మరువకముందే ఈరోజు మరొక రైలు దోపిడీ ఘటన పల్నాడు ప్రాంతంలో చోటు చేసుకుంది. నడికుడి ప్రాంతంలో రైల్వే స్టేషన్ కు సమీపంలోనే నర్సాపూర్ ఎక్స్ ప్రెస్ పై దోపిడీ దొంగలు రాళ్ళతో దాడి చేశారు. ట్రైన్ చైన్ లాగిన దుండగులు ఎస్ 11, ఎస్ 12 కోచ్ లోపలికి ప్రవేశించేందుకు ట్రై చేశారు. కానీ, రైలు కోచ్, డోర్లు, విండోలు కూడా మూసి ఉండటంతో దోపిడీ దొంగల ప్రయత్నం ఫలించలేదు. ఈ నేపథ్యంలో పల్నాడు ప్రాంతంలో వరుసగా జరుగుతున్న రైలు దోపిడీ వ్యవహారాలు ప్రయాణికులకు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.