NTV Telugu Site icon

Pawan Kalyan: మంత్రులపై దాడి కేసు.. జనసేన కార్యకర్తల అరెస్ట్

Vizag Cp

Vizag Cp

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తతకు దారితీస్తోంది. శనివారం విశాఖకు చేరుకున్న పవన్ కళ్యాణ్ పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. విశాఖ గర్జనకు పిలుపునిచ్చిన నాన్ పొలిటికల్ జేఏసీకి వైసీపీ మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ముగించుకుని వెళుతున్న వైసీపీ మంత్రుల కార్లపై దాడి జరిగింది. విశాఖ ఎయిర్ పోర్ట్ వద్ద మంత్రులపై దాడి జరిగిన ఘటనలో పలువురు జనసేన కార్యకర్తల్ని అరెస్ట్ చేసినట్టు విశాఖ సీపీ ఒక ప్రకటనలో తెలిపారు. నోవాటెల్ వద్ద పలువురు జనసేన కార్యకర్తలను అరెస్టు చేశారు పోలీసులు.

Read Also: Deputy CM Peedika Rajanna Dora: నేను పవన్‌ అభిమానిని.. ఈ ఘటనతో అది పోగొట్టుకున్నాడు..!

ఎయిర్ పోర్ట్ వద్ద ఎటువంటి అనుమతి లేకుండా జనసేన కార్యకర్తలు మంత్రి రోజాను, వైసీపీ నేతలను అగౌరపరిచే విధంగా వ్యవహరించారు..వాళ్ళపై దాడి చేసి చంపాలని చూసారని కేసు నమోదయింది. దీనివల్ల ప్రజాశాంతికి భంగం వాటిల్లింది.

ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. సెక్షన్ 30 ప్రకారం వెస్ట్ జోన్ ప్రాంతంలో ఎటువంటి కార్యక్రమాలు చేయరాదు..జనసేన కార్యకర్తల వ్యవహారంతో ఎయిర్ పోర్ట్ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసులతో పాటు సామాన్య ప్రజలకు గాయాలయ్యాయి..ఎయిర్ పోర్ట్ వద్ద సామాన్య ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఎయిర్ పోర్ట్ వద్దకు 30 మంది ప్రయాణికులు చేరుకోలేక ఫ్లైట్లు మిస్ అయ్యారని విశాఖ సీపీ తెలిపారు. దీంతో జనసేన కార్యకర్తలపై కేసులు నమోదుచేసి, అరెస్టు చేశామని ఆ ప్రకటనలో వివరించారు.

Read Also: Russia-Ukraine War: రష్యా సైనిక శిక్షణా శిబిరంపై ఉగ్రదాడి..11 మంది మృతి