Atal Bihari Vajpayee Jayanti: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారతరత్న, మాజీ ప్రధాన మంత్రి అటల్ బీహారీ వాజ్‌పేయి జయంతి వేడుకలు ఘనంగా కొనసాగుతున్నాయి. రాజధాని అమరావతిలో 14 అడుగుల వాజ్‌పేయి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహాన్ని కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో కలిసి సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు.
Read Also: Mumbai: ఉద్ధవ్ థాక్రేతో శరద్‌పవర్ పార్టీ పొత్తు ఉన్నట్టా? లేనట్టా? సుప్రియా సూలే ఏమందంటే..!
ఇక, ప్రధాని నరేంద్ర మోడీ అటల్ బిహారీ వాజ్‌పేయి జయంతిని సుపరిపాలన దినోత్సవంగా ప్రకటించారు అని ఏీ బీజేపీ చీఫ్ మాధవ్ అన్నారు. అలాగే, అమరావతిలో మొట్ట మొదటి విగ్రహం వాజ్ పాయిది ఏర్పాటు చేయటం ఆనందంగా ఉందన్నారు.. నాలుగు సీఎంలుగా పని చేసిన చంద్రబాబు, శివరాజ్ సింగ్ ఆధ్వర్యంలో జరగటం ఆనందంగా ఉంది. వాజ్ పాయి జీవితం అందరికీ ఆదర్శం, ఆయన విగ్రహం అందరికీ స్పూర్తి దాయకం అన్నారు. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో అటల్ బిహారీ వాజ్ పేయి విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు సీఎం చంద్రబాబు సహకారం మర్చిపోలేమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు.
అయితే, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా గోరక్షణ పేటలో
నూతనంగా ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి నివాళులు అర్పించింది. మాజీ ప్రధాని వాజ్ పేయి జన్మదినాన్ని బీజేపీ సుపరిపాలన దినోత్సవంగా జరుపుకుంటుంది.. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే దేశంలో సుపరిపాలనకు పునాది వేశారని పేర్కొనింది. స్వర్ణ చతుర్భుజీ జాతీయ రహదారుల నుంచి గ్రామాల్లో అనుసంధాన రోడ్ల వరకు నిర్మాణం చేశారు.. సర్వ శిక్ష అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి- నిర్బంధ విద్య అమలు చేశారు.. పోఖ్రాన్ అణు పరీక్షల ద్వారా మన దేశ సత్తాను ప్రపంచానికి చాటారు.. భారత్ స్వయం సమృద్ధి కోసం నాడు వాజ్ పేయి పునాదులు వేశారని ఎంపీ పురందేశ్వరి అన్నారు.
Read Also: Varanasi : 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యతో మహేష్ బాబు విశ్వరూపం.. రాజమౌళి మాస్టర్ ప్లాన్ ఇదే!
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 101వ అటల్ జీ జయంతి సందర్భంగా ప్రత్యేక నివాళి అర్పిస్తున్నాను.. సామాన్య స్థాయి నుంచి అసామాన్య స్థాయికి ఎదిగిన నేత అటల్ జీ.. తన సుదీర్ఘ రాజకీయ చరిత్ర లో ఎటువంటి అవినీతి మరక లేని ఏకైక నేత అటల్ జీ.. మారుమూల గ్రామాలను పట్టణాలకు అనుసంధానించిన నేత అటల్ బిహారీ వాజ్ పేయి.. కాలంతో పాటు కనుమరుగు అయ్యే వ్యక్తి నాయకుడు కాదు.. చరిత్ర ఉన్నంత వరకు మననం చేసుకున్న వ్యక్తే అసలైన నాయకుడు.. అభివృద్ధినీ కేవలం దేశ రాజధాని వరకే పరిమితం చేయకుండా దేశంలోని అన్ని వర్గాలకు అందించిన వ్యక్తి అటల్ జీ అని మంత్రి సత్యకుమార్ తెలిపారు.
