Site icon NTV Telugu

Asani Cyclone: ఏపీలోని పలు జిల్లాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు

Asani Control Room Numbers

Asani Control Room Numbers

అసని తీవ్ర తుఫాన్ నేపథ్యంలో విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. పలు ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం-08942-240557, విజయనగరం కలెక్టరేట్-08922-236947, 08922-276888, చీపురుపల్లి-9440717534, భోగాపురం-8074400947, విశాఖ-0891-2590100, 2590102 నెంబర్లను అందుబాటులో ఉంచారు. అటు ఒంగోలు కలెక్టరేట్‌లో కూడా అధికారులు కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కంట్రోల్ రూం నంబర్ : 1077, పోలీస్ వాట్సప్ నంబర్ : 9121102266. చీరాల ఆర్డీవో కార్యాలయంతో పాటు అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మరోవైపు అసని తీవ్ర తుఫాన్ కారణంగా బాపట్ల జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బాపట్ల, రేపల్లె, నిజాంపట్నం, భట్టిప్రోలు, కొల్లూరు మండలాల్లో ఎడతెరిపి లేని వర్షం పడుతోంది. ఈ నేపథ్యంలో బాపట్ల కలెక్టరేట్‌లో అధికారులు కంట్రోల్ రూమ్‌ ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూమ్ నెoబర్లు: 87126 55878, 87126 55881, 87126 55918. అంతేకాకుండా తీర ప్రాంత మండలాల్లోని తహసీల్దార్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని అధికారులు తెలిపారు.

అసని తుఫాన్ ప్రభావంతో ప్రకాశం జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంత మండలాలైన ఒంగోలు, కొత్త పట్నం, టంగుటూరు, నాగులుప్పలపాడు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన మోస్తరు వర్షం కురిసింది. జరుగుమిల్లి మండలంలో అత్యధికంగా 34 మిల్లీ మీటర్లు, ఒంగోలులో 26 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. తుఫాన్ కారణంగా మత్స్య కారులు చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Asani Cyclone: ప్రయాణికులకు ముఖ్య గమనిక.. 37 రైళ్లు రద్దు

Exit mobile version