NTV Telugu Site icon

Shabbir Ali: నేను బ్రతికున్నంత వరకు కామారెడ్డి జిల్లాను తీయలేరు..

Shabbir Ali

Shabbir Ali

ఆరులో ఐదు గ్యారెంటీలు పూర్తి చేశామని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ అన్నారు. కామారెడ్డిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ధనిక రాష్ట్రం తెలంగాణాను Brs ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి కాంగ్రెస్ వచ్చాక చిప్ప చేతికి ఇచ్చిందని ఆరోపించారు. కచ్చితంగా అన్ని హామీలు నెరవేరుస్తామని స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లాను తీసేస్తారు.. అనేది పచ్చి అబద్ధమని.. జిల్లా మార్చే ప్రసక్తే లేదని తెలిపారు. నేను బ్రతికున్నంత వరకూ అది జరగదన్నారు.

READ MORE: YouTuber Arrested: మహిళా పోలీసులపై నోటి దురద వ్యాఖ్యలు.. యూట్యూబర్ ను అరెస్ట్ చేసి తీసుకెళ్తుండగా యాక్సిడెంట్!

కామారెడ్డి జిల్లాకు ప్రాణహిత చేవెళ్ల నీళ్ళు కావాలని రేవంత్ రెడ్డి కి విన్నవిస్తామని చెప్పారు. కరవుకు కాంగ్రెస్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. నా ఫోన్ ను ఐదేళ్లు ట్యాపింగ్ చేశారని ఆరోపించారు. సురేష్ శెట్కా ర్ గెలిస్తే కామారెడ్డి అభివృద్ధి చెందుతుందన్నారు. ప్రభుత్వాలు కూల గొట్టడంలో బీజేపీ నంబర్ వన్ అని విమర్శించారు. వారి ఉనికి కోసమే బీజేపీ వాళ్లు కాంగ్రెస్ కూలి పోతుందని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హామీలు ఎన్ని నెరవేర్చావో ముందు చెప్పుమని ఎంపీ అరవింద్ ను ప్రశ్నించారు. బీజేపీ వాళ్లను ఏమైన అడిగితే హిందూ ముస్లిం గొడవలు అంటారన్నారు.

మరోవైపు రాష్ట్రంలో అత్యధిక ఎంపీ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రధాన పార్టీలు పోటీ పడుతున్నాయి. అధికార కాంగ్రెస్ తో సహా బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ప్రచారం జోరు పెంచారు. వారి వారి పద్ధతిలో జనాలను ఓట్లు అడగడమే కాకుండా ఒకరినొకరు తీవ్రంగా విమర్శించుకుంటున్నారు. మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర చేపట్టారు. అన్ని నియోజకవర్గాలు తిరుగుతూ.. మరోసారి బీఆర్ఎస్ ను ఆదరించాలని కోరుతున్నారు. మరో వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన శైలిలో ప్రచారంలో దూసుకుపోతున్నారు. గత ఎన్నికల్లో సాధించిన సీట్ల కంటే ఈ సారి ఎక్కువ సీట్లను కైవసం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది.