NTV Telugu Site icon

APSRTC: గుడ్‌న్యూస్‌ చెప్పిన ఆర్టీసీ.. సంక్రాంతి ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే

Apsrtc

Apsrtc

పండుగలు వచ్చాయంటే చాలు.. ప్రత్యేక సర్వీసులను నడపడం.. ఇదే సమయంలో చార్జీలను భారీగా పెంచి క్యాష్‌ చేసుకోవడం చూస్తూనే ఉన్నాం.. ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సులు అయితే.. ఈ సమయంలో అందినకాడికి దోచుకుంటాయనే విమర్శలు ఉన్నాయి.. అయితే, సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రోడ్డు రావాణా సంస్థ (ఏపీఎస్‌ఆర్టీసీ).. జనవరి 6వ తేదీ నుంచి 18వ తేదీ వరకు అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడపాలని నిర్ణయం తీసుకుంది.. ఇదే సమయంలో.. ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలును చేయాలని నిర్ణయించింది. ఎక్కడున్నా.. సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్తుంటారు ప్రజలు.. దీంతో, రద్దీ ఎక్కువగా ఉంటుంది.. రైళ్లు, బస్సులు, ప్రైవేట్‌ సర్వీసులు ఇలా ఏవి తీసుకున్నా రద్దీగానే ఉంటాయి.. రద్దీని దృష్టిలో పెట్టుకుని జనవరి 6 నుంచి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకు సర్వీసులు నడపాలని, ప్రత్యేక బస్సుల్లోనూ సాధారణ ఛార్జీలే వసూలు చేయాలని నిర్ణయించింది ఏపీఎస్‌ఆర్టీసీ. అంతేకాకుండాజజ పండుగ రద్దీ దృష్ట్యా పొరుగు రాష్ట్రాలకూ సర్వీసులు నడపనుంది. విజయవాడ నుంచి పలు ప్రాంతాలకు వెయ్యి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఆర్టీసీ వెబ్‌సైట్, టికెట్‌ బుకింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక బస్సుల్లో ముందస్తు టికెట్‌ రిజర్వేషన్‌ సదుపాయం కల్పించనుంది ఏపీఎస్‌ఆర్టీసీ.

Read Also: Off The Record: బలం అనుకున్నదే రివర్స్‌.. ఎమ్మెల్యే తోపుదుర్తికి సోదరుడే సమస్యా..?