సీఎం వైఎస్ జగన్ ను కలిశారు ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయడంపై సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు ఉద్యోగులు. ఈసందర్భంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలోకి తీసుకున్నారు. కరోనా సమయంలోనూ ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలు ఇబ్బంది లేకుండా చేశారు సీఎం వైఎస్ జగన్. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి వారికి పీఆర్సీ అమలు చేయబోతున్నారు. గురుకుల, ఎయిడెడ్, యూనివర్సిటీ ఉద్యోగుల వయోపరిమితి పెంచే విషయంపై సీఎం సానుకూలంగా స్పందించారు.
పిటిడి వైఎస్సార్ ఎంప్లాయ్ అసోసియేషన్ ప్రతినిధి చల్లా చంద్రయ్య మాట్లాడుతూ.. 52 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం వైఎస్ జగన్ కి దక్కుతుందన్నారు. 10 వేల కోట్ల జీతాలు మాకు చెల్లించి ఆర్టీసీ భవిష్యత్తును కాపాడారు. అక్టోబర్ 1 నుంచి కొత్త పే స్కేల్ అమలు చేయబోతున్నారు. మేము ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపాం. ఆర్టీసీ ఉద్యోగులు ఈ ముఖ్యమంత్రికి రుణపడాల్సి ఉంది.
Read Also: Operation Octopus: 8 రాష్ట్రాల్లో ఎన్ఐఏ సోదాలు.. 170 మంది పీఎఫ్ఐ కార్యకర్తల అరెస్ట్
పెన్షన్ విషయాన్ని కూడా సీఎం దృష్టికి తీసుకెళ్ళాం…ఆయన సానుకూలంగా స్పందించారన్నారు చల్లా చంద్రయ్య. పదోన్నతుల ఫైల్ కూడా ప్రభుత్వానికి పంపారు. అది కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. గురుకుల, యూనివర్సిటీ ఉద్యోగులకు 62 ఏళ్లు వయోపరిమితి సీఎం దృష్టికి తీసుకెళ్లాం అనీ, ఆయన సానుకూలంగా స్పందించి అధికారులను ఆదేశించారని ఏపీ యూనివర్సిటీల నాన్ టీచింగ్ ఎంప్లాయ్ అసోసియేషన్ నేత వెంకటప్ప రెడ్డి అన్నారు.
Read Also: Anirudh Ravichandran: సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ ఇంట త్రీవ విషాదం
