Group 1 Mains 2025: ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ్టి నుంచి ఈ నెల 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. మొత్తం 89 పోస్టులకు జరగనున్న గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు.. ఉదయం 8:30 నుంచి 9:30 వరకూ పరీక్ష కేంద్రంలోకి అనుమతి ఉంటుంది. అలాగే, 15 నిముషాల అదనపు అవకాశంతో 9:45 వరకూ పరీక్షా కేంద్రంలోకి అనుమతి ఇస్తారు. హాల్ టికెట్, ఒక గుర్తింపు కార్డు, బ్లూ లేదా బ్లాక్ బాల్ పాయింట్ పెన్ మాత్రమే లోపలికి అనుమతి ఇవ్వనున్నారు. ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలు పరీక్షా కేంద్రంలోకి అనుమతించబడవు అని అధికారులు తెలిపారు.
Read Also: GT vs SRH: అభిషేక్ ఒంటరి పోరాటం వృథా.. హైదరాబాద్‌ను ఓడించిన గుజరాత్
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు జిల్లాలలో పద మూడు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి రోజు తెలుగు అర్హత సాధించే పరీక్ష ఉండనుంది. మొత్తం అభ్యర్ధులు 4,496 మంది ఉండగా, విశాఖపట్నంలో 1190 మంది, విజయవాడలో 1801 మంది, తిరుపతిలో 911 మంది, అనంతపురంలో 594 మంది చొప్పున అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారు. ఇక, విశాఖలో 2, విజయవాడలో 6, తిరుతిలో 3, అనంతపురంలో 2 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు.
