నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్ చెప్పింది. నేటితో ముగియాల్సిన గ్రూప్-4 ఉద్యోగాల గడువును మరోసారి ఏపీపీఎస్సీ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. నిరుద్యోగుల అభ్యర్థనతో ఏపీపీఎస్సీ మరోసారి గడువు పెంచింది. దీంతో ఫిబ్రవరి 6 వరకు నిరుద్యోగులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది. రెవెన్యూ డిపార్టుమెంట్‌లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులకు ఆన్‌లైన్ అప్లికేషన్ డెడ్‌లైన్ ఈరోజుతో ముగియాల్సి ఉంది.
Read Also: ప్రధానికి సీఎం జగన్ లేఖ.. ఐఏఎస్‌లను అలా పంపితే మా పరిస్ధితేంటీ..?
గతంలో కూడా ఏపీపీఎస్సీ గ్రూప్-4 ఉద్యోగాల దరఖాస్తు గడువును పెంచింది. జనవరి 19తో ముగియాల్సిన గడువును నిరుద్యోగ యువత అభ్యర్థన మేరకు జనవరి 29వరకు పెంచింది. ఇప్పుడు రెండోసారి డెడ్‌లైన్‌ను పెంచుతూ ఏపీపీఎస్సీ నిర్ణయం తీసుకుంది. అభ్యర్ధులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ https://psc.ap.gov.in ద్వారా ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 670 పోస్టులను ఏపీ ప్రభుత్వం భర్తీ చేయనుంది. 18 నుంచి 42 ఏళ్లలోపు వయసున్న అభ్యర్ధులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు.