Site icon NTV Telugu

తెలుగు రాష్ట్రాలకు కొత్త సీజేల నియామకం

రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకం అయ్యారు. ఆంధ్రప్రదేశ్ సిజే అరూప్ కుమార్ గోస్వామి.. ఛత్తీస్ గఢ్ కు బదిలీ కాగా… ఛత్తీస్ గఢ్ ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా ఆంధ్రప్రదేశ్ సిజే గా బదిలీ అయ్యారు. ఇక తెలంగాణ హైకోర్టు కు ప్రధాన న్యాయమూర్తి నియామకం అయ్యారు. కర్ణాటక హైకోర్టు యాక్టింగ్ సిజేగా ఉన్న సతీష్ చంద్ర శర్మ ను తెలంగాణ సిజేగా బదిలీ అయ్యారు. కొలీజియం సిఫారసు మేరకు తెలుగు రాష్ట్రాలకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు నియామకం అయ్యారు. ఇక వీరిద్దరూ… సోమ వారం బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది.

Exit mobile version