NTV Telugu Site icon

Kalyanamastu: టీటీడీ ఉచిత వివాహాలకు నేటి నుంచే దరఖాస్తుల స్వీకరణ

Ttd Kalyanamastu

Ttd Kalyanamastu

పెళ్లి చేసుకోవాలనుకునే పేదలకు టీటీడీ అధికారులు గుడ్‌న్యూస్ అందించారు. ఉచిత వివాహాలు జరిపించేందుకు టీటీడీ చేపట్టిన కళ్యాణమస్తు కార్యక్రమానికి నేటి నుంచి ఈనెల 20 వరకు అప్లికేషన్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కలెక్టర్, ఆర్డీవో, ఎమ్మార్వో కార్యాలయాల ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఆగస్టు 7న వీరికి ఉచిత సామూహిక వివాహాలు చేయనున్నారు. కళ్యాణమస్తు కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకున్న నూతన వధూవరులకు ఉచితంగా 2 గ్రాముల బంగారు తాళిబొట్టు, వెండిమెట్టెలు, పెళ్లి వస్త్రాలు, సామగ్రిని అధికారులు ఇవ్వనున్నారు.

Read Also: Tenth Class Diaries Review: టెన్త్ కాస్ల్ డైరీస్‌

కాగా టీటీడీ చేపట్టిన కళ్యాణమస్తు కార్యక్రమానికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ పాలకమండలి ఛైర్మన్‌గా ఉన్న సమయంలో శ్రీకారం చుట్టారు. 2006లో ఈ పథకానికి రూపకల్పన చేయగా.. 2007 ఫిబ్రవరి 21వ తేదీ ఈ కార్యక్రమం ప్రారంభమైంది. అప్పట్లో ఒక్కో జంటకు 7 వేల రూపాయల వరకు ఖర్చు చేసేవారు. అప్పట్లో ప్రారంభించిన కళ్యాణమస్తు కార్యక్రమం ద్వారా 34,017 జంటలను టీటీడీ ఒక్కటి చేసింది. దీంతో ఖర్చు సుమారు 24 కోట్ల రూపాయలు అయ్యాయని అంచనా. బంగారపు తాళిబొట్టు, వెండి మెట్టెలు, వధూవరులకు నూతన వస్త్రాలు, తలంబ్రాలు, పెళ్ళిసామాగ్రి, మంగళ వాయిద్యాలు, ధార్మిక స్తోత్ర పుస్తకాలు, పురోహితుడు, 60 మంది బంధు మిత్రులకు పెళ్ళి భోజనాలు ఉచితంగా టీటీడీ కల్పించేది.

Read Also:Breaking: వినియోగదారులకు ఊరట.. తగ్గిన సిలిండర్ ధరలు