APPCC Chief Gidugu Rudraraju Gives Strong Warning To Ram Gopal Varma: వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఏపీసీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. వర్మ తీస్తున్న వ్యూహం సినిమాలో సోనియా గాంధీని చెడుగా చూపిస్తే.. వర్మని బట్టలూడదీసి కొడతామని హెచ్చరించారు. అసలు వాస్తవాలేంటో వర్మకి తెలుసా? అని ఆయన ప్రశ్నించారు. తమ సోనియాను గానీ, చరిత్రను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తే గానే.. చూస్తూ ఊరుకునేలేదే లేదని ధ్వజమెత్తారు. ‘వర్మ.. ఖబడ్దార్’ అంటూ విరుచుకుపడ్డారు. వ్యూహం టీజర్ చూసిన అనంతరం.. గిడుగు రుద్రరాజు ఈ స్థాయిలో వర్మపై విరుచుకుపడ్డారు. ఇక ఇదే సమయంలో.. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలోకి వస్తే ఆహ్వానిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ విధానాలకు, సిద్దాంతాలకు కట్టుబడి ఎవరూ వచ్చిన తాము స్వాగతిస్తామని స్పష్టతనిచ్చారు. రాజశేఖరరెడ్డి కాంగ్రెస్ పార్టీ మహానాయకుడని చెప్పిన ఆయన.. గాంధీ భవన్‌లో సీఎల్పీ సమావేశం జరిగినప్పుడు, రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చేయాలనేది ఆయన చివరి కోరిక అని రాజశేఖరరెడ్డి చెప్పినట్లు గుర్తు చేసుకున్నారు. ఆయన కోరికను నెరవేర్చడం కోసమే తాము పార్టీలో పని చేస్తున్నామని.. ఆ కోరికలో భాగస్వామురాలిగా షర్మిల కూడా వచ్చి పనిచేస్తే తప్పకుండా పార్టీలోకి స్వాగతిస్తామని తెలిపారు.
LML Star: ఈ స్కూటీకి ఒక్కసారి ఛార్జింగ్ పెడితే.. 225 కి.మీ వెళ్లొచ్చు..
అంతకుముందు.. తమ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలోకి వస్తే, ప్రత్యేక హోదా తప్పకుండా ఇస్తామని గిడుగు రుద్రరాజు హామీ ఇచ్చారు. దేశంలో, రాష్ట్రంలో సంక్షేమ పాలన కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. వైయస్ జగన్ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని.. జగన్ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతున్నా కడప ఉక్కు పరిశ్రమ ఊసే లేదని ఆరోపించారు. చెన్నూరు చక్కెర కర్మాగారం తెరిపిస్తానని హామీ ఇచ్చిన జగన్.. దానికి అతీగతీ లేకుండా చేశారన్నారు. ఇండస్ట్రియల్ హబ్‌గా మారుస్తామని చెప్పారు కానీ.. జిల్లాలో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదని రుద్రరాజు మండిపడ్డారు.
Project k : సినిమాలో కమల్ హాసన్ నటించబోతున్నట్లు అధికారికంగా ప్రకటించిన మేకర్స్..