Site icon NTV Telugu

Smart Meters: స్మార్ట్ విద్యుత్ మీటర్లుతో ఎన్నో ఉపయోగాలు.. ఆందోళన వద్దు..

Nagarjuna Reddy

Nagarjuna Reddy

Smart Meters:  స్మార్ట్ విద్యుత్ మీటర్లుతో చాలా ఉపయోగాలు ఉన్నాయని.. అనవసరమైన ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సీ.వీ.నాగార్జున రెడ్డి.. తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో 18వ రాష్ట్రస్థాయి సలహా కమిటీ సమావేశం జరిగింది.. ఆ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వ్యవసాయ విద్యుత్ మీటర్లతో డబ్బులు వసూలు చేస్తామనే ప్రచారం అపోహ మాత్రమేనని కొట్టిపారేశారు.. ఉచిత విద్యుత్ మీటర్ల విషయంలో రైతులకు ఎలాంటి ఆందోళన అవసరంలేదన్నారు.. 30 ఏళ్లకు సరిపడా ఉచిత విద్యుత్ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.. ఉచిత విద్యుత్ అందించేందుకు సిక్కిం నుండి 7వేల మెగా వాట్ల సోలార్ పవర్ ను ప్రభుత్వం కొనుగోలు చేసిందని.. ప్రతి యూనిట్ కు అకౌంటబిలిటీ కోసమే విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వం స్పష్టంగా ఉంది గుర్తుచేశారు.. అసలు, స్మార్ట్ విద్యుత్ మీటర్లతో చాలా ఉపయోగాలు ఉన్నాయని తెలిపారు.. 200 యూనిట్లకు పైగా వినియోగించే వారికి త్వరలో ప్రీపెయిడ్ మీటర్లు అందుబాటులో ఉంచుతామని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సీ.వీ.నాగార్జున రెడ్డి.

Read Also: MLC Elections 2023: ఎమ్మెల్సీ ఎన్నికలకు.. వైసీపీ అభ్యర్థులు వీరే

Exit mobile version