దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలు, కోర్టులు వ్యవహరిస్తున్న తీరుపై ఏపీసీసీ అత్యవసరంగా సమావేశం అయ్యింది. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ వ్యవస్థల ను దుర్వినియోగ పరుస్తోందని మండిపడ్డారు ఏఐసీసీ నేత మెయ్యప్పన్. అదానీ వ్యవహారం పై జాయింట్ పార్లమెంటు కమిటీ వేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది..ఒక్క రాహుల్ గాంధీ అనర్హత వేటు వేయడం గురించి మాత్రమే కాంగ్రెస్ పోరాటం చేయడం లేదన్నారు మెయ్యప్పన్. ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ.. రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వాన్ని రద్దుచేయడంపై ఆందోళన నిర్వహిస్తామన్నారు.
Read Also: Chennai Super Kings: దయచేసి అతడ్ని తొలగించండి.. అతని వల్లే అనర్థాలు
ఏప్రిల్ 1 తేదీ నుంచి ఏప్రిల్ చివరి వరకూ కాంగ్రెస్ పార్టీకి చెందిన అన్ని శ్రేణులు కార్యాచరణ చేపడతాం..ఇవాళ్టి నుంచే ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అంటూ ఆందోళన మొదలు పెడతాం..విజయవాడ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం..ఏప్రిల్ 4 తేదీన పోస్టు కార్డుల ఉద్యమం..ఏప్రిల్ 15 నుంచి అన్ని జిల్లా కలక్టరేట్ ల వద్ద ఆందోళన చేస్తాం..20- 30 ఏప్రిల్ వరకూ ఇతర ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు గిడుగు రుద్రరాజు. అదానీ ఆస్తులను కాపాడేందుకు ప్రధాని మోదీ చేస్తున్న తీరు పై ఆందోళన చేస్తాం. గాంధీ, నెహ్రూ కుటుంబాలను ఉనికి లోకే లేకుండా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్రంలో బిజెపి అంటే బాబు, జగన్, పవన్ అన్న తీరుగా ఉందన్నారు ఎద్దేవా చేశారు ఏపీ కాంగ్రెస్ నేతలు.
Read Also: CM KCR : మన దగ్గర సత్తా ఉంటే అసంభవం అంటూ ఏమీ ఉండదు
