NTV Telugu Site icon

ప్రతిపక్షాలకు స్పీకర్ తమ్మినేని ఛాలెంజ్

Tammineni Sitaram

Tammineni Sitaram

ప్రతిపక్షాలకు సవాల్‌ విసిరారు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారం… సరుబుజ్జిలి మండలంలో పర్యటించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ… ప్రతిపక్షాలకు సవాల్ విసిరారు.. ప్రభుత్వ పథకాలపై విమర్శలు చేయడం కాదు, బడుగు, బలహీన వర్గాల వారికి ప్రభుత్వం అందిస్తున్న ఏ పథకం అందడం లేదో సమాధానం చెప్పాలన్నారు.. మాటలు చెప్పడం కాదు… చేతల్లో చేసి చూపాలని హితవుపలికిన ఆయన.. నెత్తిమీద రూపాయి పెడితే చెల్లని వాళ్లు పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు.. గత పాలకులు స్కూళ్లలోహ సదుపాయాలున్నాయో లేదో ఒక్కనాడైనా చూశారా? అలాంటి వాళ్లా సీఎం వైఎస్‌ జగన్‌ గురించి మాట్లాడేది అంటూ మండిపడ్డారు.

స్పీకర్ మాట్లాడటమేంటనని ఎవరేమైనా అనుకోండి.. రమ్మనండి నేను సమాధానం చెబుతా అన్నారు తమ్మినేని.. మంచి చేసేవాళ్లు శత్రువైనా… శభాష్ అనాలి, ప్రతిపక్షాలకు విశాల హృదయం లేదన్న ఆయన.. వాళ్ల హృదయాలన్నీ ఇరుకు సందులతో ఇరుక్కుపోయి ఉన్నాయని ఎద్దేవా చేశారు.. దేశంలో ఒకేసారి 30 లక్షలు ఇళ్లు కట్టిస్తున్న మొనగాడెవరైనా ఉన్నారా ? అని ప్రశ్నించిన స్పీకర్.. వైఎస్‌ జగన్ ను విమర్శించే వాళ్లను అడుగుతున్నా సమాధానం చెప్పండి? అని డిమాండ్‌ చేశారు. మాటలకు పెట్టుబడి అవసరం లేదు కాబట్టి ఎన్నైనా మట్లాడతారు అంటూ మండిపడ్డారు తమ్మినేని సీతారాం.