ఏపీ విద్యార్థులకు అలెర్ట్.. ఇవాళ ఏపీ వ్యాప్తంగా స్కూల్స్ కు సర్కార్ సెలవులు ప్రకటించింది.. అందుకు కారణం కూడా భారీ వర్షాలు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ తుఫాను నేపథ్యంలో స్కూళ్లకు ఇవాళ సెలవు ప్రకటిస్తూ ఏపీ విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది..
ఈ తుఫాన్ ప్రభావం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.. గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి.. నెల్లూరు నుంచి కాకినాడ వరకు ఉన్న కోస్తా జిల్లాలలో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నందున ఆయా జిల్లాలలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని విద్యాశాఖ కమిషనర్ సురేష్ ఆదేశాలు జారీ చేశారు. మిగతా జిల్లాలలో తీవ్రతను బట్టి కలెక్టర్లు నిర్ణయం తీసుకోవాలని సూచనలు చేశారు.. సముద్ర తీర ప్రాంతాల ప్రజలు అలెర్ట్ గా ఉండాలని అధికారులు సూచించారు..
ప్రకాశం జిల్లాలు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇవాళ, రేపు కూడా స్కూల్స్ లేవని సర్కార్ తెలిపింది.. ఇకపోతే ఈ తుఫాను కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. అటు తుఫాను నేపథ్యంలో ఏపీ ప్రజలు అలర్ట్ గా ఉండాలని సీఎం జగన్ కూడా అధికారులను అలర్ట్ చేశారు.. తీర ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు..