NTV Telugu Site icon

ఇక ఏపీ రాజకీయ నాయకులు బాక్సింగ్, కరాటే నేర్చుకోవాల్సిందే : ఆర్జీవీ

ఏపీలో రాజకీయ నాయకులు నువ్వేంత అంటే నువ్వేంత అన్నట్టు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటలు తారాస్థాయి చేరకున్నాయి. ఓవైపు టీడీపీ అధినేత చంద్రబాబు 36 గంటల దీక్ష ప్రారంభించారు. మరో వైపు పట్టాభిరామ్‌ సీఎం జగన్‌ పై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా వైసీపీ నాయకులు జనాగ్రహా దీక్షకు దిగారు. అంతేకాకుండా టీడీపీ, వైసీపీ నేతలు వ్యక్తిగత దూషణలు దిగారు.

ఎప్పడూ వివాదాలతో నిద్రలేచే ఆర్జీవీ ఏపీ రాజకీయాలపై ట్విట్టర్‌ లో పోస్టు చేశారు. ఈ ట్విట్‌ సారాంశం.. ఏపీ రాజకీయ నాయకులు త్వరలో బాక్సింగ్, కరాటే, స్టిక్ ఫైటింగ్ మొదలైన వాటిలో శిక్షణ పొందాల్సిందే అంటూ కామెంట్ చేశారు. చూడాలి మరి.. ఏపీ రాజకీయ నాయకులు ఈయన ట్వీట్ పై ఏవిధంగా స్పందిస్తారో..