చాలాకాలం నుంచి బిల్లులు పెండింగ్‌లోనే ఉండడంతో.. పంచాయతీ రాజ్ కాంట్రాక్టర్లు ఈఎన్సీని కలిశారు. పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాల్సిందిగా కోరారు. ఇదే సమయంలో తమ ఆవేదనని వెళ్ళగక్కారు. పీఎంజీఎస్‌వై కింద చేపట్టిన పనుల్లో రూ.250 కోట్ల మేర బిల్లులు 10 నెలల నుంచి పెండింగ్‌లోనే ఉన్నాయని, వాటి చెల్లింపులు జరపడం లేదని వాపోయారు. కాంట్రాక్టర్లు ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తమ గోడు వెళ్లబోసుకున్నారు.
Read Also: Minister Harish Rao: రాహుల్ ఎందుకొస్తున్నావ్.. ఏం చెప్పడానికి..?
ఓవైపు పనులు నెమ్మదిగా చేయమని ఈఎన్సీ సూచిస్తుంటే, మరోవైపు ప్రజా ప్రతినిధులు మాత్రం త్వరగా పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారన్నారు. ఇంటింటికి వైసీపీ కార్యక్రమం ఉందని, వెంటనే రోడ్లు వేయాలని ఎమ్మెల్యేలు ప్రెజర్ పెడుతున్నారని వెల్లడించారు. పనులు చేపట్టే విషయంలో ఈఎన్సీ ఒక రకంగా.. ప్రజా ప్రతినిధులు మరో రకంగా చెప్తున్నారని.. దీంతో తాము తీవ్ర ఒత్తిడికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ అండ్ బి తరహాలోనే పంచాయతీ రాజ్ పనులను చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా చూడాలని కోరారు. వీరి వాదనల్ని విన్న ఈఎన్సీ.. వీలైనంత త్వరలోనే చెల్లింపులు జరుపుతామని హామీ ఇచ్చింది.
