ఆంధ్రప్రదేశ్‌లో ఏప్రిల్ 1 నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ (ఆరోగ్యశ్రీ) పథకం కింద వైద్య సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రైవేట్ ఆసుపత్రుల అసోసియేషన్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. ప్రభుత్వం నుంచి రావాల్సిన దాదాపు 3000 కోట్ల రూపాయల బకాయిలు పెండింగ్‌లో ఉండటం, కొత్తగా అమలు చేయాలనుకుంటున్న ‘యూనివర్సల్ హెల్త్ కవరేజ్’ (UHC) విధానంపై అభ్యంతరాల నేపథ్యంలో ఆసుపత్రుల యాజమాన్యాలు ఈ కఠిన నిర్ణయాన్ని ప్రకటించాయి. గత నాలుగు నెలల్లోనే ఈ బకాయిలు 2500 కోట్ల నుండి 3000 కోట్లకు చేరుకున్నాయని, వీటి చెల్లింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పష్టమైన రోడ్ మ్యాప్ అందడం లేదని ఆసుపత్రుల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Aishwarya Rajesh: మరో సీనియర్ హీరో సరసన ఐశ్వర్యా రాజేష్?
ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఇన్సూరెన్స్ మోడల్‌లో తీసుకురావాలని భావిస్తున్న కొత్త విధానంపై ఆసుపత్రులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యంగా 2017 నాటి పాత ప్యాకేజీ ధరలనే ఇప్పటికీ కొనసాగిస్తున్నారని, పెరిగిన వైద్య ఖర్చులు , ఆసుపత్రుల నిర్వహణ భారంతో పాత రేట్లకు వైద్యం అందించడం సాధ్యం కాదని స్పష్టం చేస్తున్నాయి. పాత బకాయిల సంగతి తేల్చకుండా కొత్త ఇన్సూరెన్స్ మోడల్‌లోకి మారితే, ఆ తర్వాత ఆ 3000 కోట్ల బాధ్యత ఎవరు తీసుకుంటారనే ఆందోళన ఆసుపత్రుల యాజమాన్యాలలో నెలకొంది. బకాయిలు అందకపోవడంతో చిన్న చిన్న ఆసుపత్రులు మూతపడే స్థితికి చేరుకున్నాయని, ఆర్థికంగా తాము తీవ్రంగా దెబ్బతింటున్నామని అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ విజయ్ కుమార్ హెచ్చరించారు. ప్యాకేజీ ధరలను సవరించి, బకాయిలను వెంటనే విడుదల చేయకుండా ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్తే రోడ్డెక్కి పోరాడతామని ఆసుపత్రుల సంఘం హెచ్చరించింది.
Ragi Boorelu Recipe : పిల్లలకి కూడా నచ్చే హెల్తీ స్వీట్.. రుచికరమైన రాగి పూర్ణం బూరెలు.!
