అధికారం అంటే హంగు, ఆర్భాటం మాత్రమే కాదు. పదిమందికి సాయం చేయడం. ప్రమాదానికి గురైనవారికి తమవంతు సాయం చేసి ఆస్పత్రికి తరలించడం. గతంలో తమ అధినేత జగన్ చూపిన మానవత్వాన్ని ఆయన మంత్రులు కూడా చేసి చూపించారు. తన కాన్వాయ్ వెళుతుండగా అంబులెన్స్ రావడం గమనించిన సీఎం జగన్ ఆ అంబులెన్స్ దారి ఇచ్చి.. అందులో వున్న రోగుల్ని కాపాడారు. అదే బాటలో నడిచారు. కొత్తగా మంత్రులైన ఇద్దరు నేతలు. వారెవరో కాదు డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు, మరొకరు గుడివాడ అమర్నాథ్.
Read Also: Anilkumar Yadav: 2024లో మళ్ళీ గెలుస్తాం…అంతా కేబినెట్లోకి వస్తాం
ఆ ఇద్దరు రాష్ట్ర మంత్రు లు. అంత కంటే ముందు మానవత్వం ఉన్న నాయకులను నిరూపించుకున్నారు. అందుకే ఇద్దరికీ ఒకే రోజు ఒకే విధమైన అనుభవం ఎదురైంది. కానీ వాళ్ల ను అధికారిక హోదా మాయ చేయలేకపోయింది. సాటి మననుషుల ప్రాణాలకు విలువ ఇవ్వాలన్న కామన్ సెన్స్ హుందాగా ఆలోచింపజేసింది. ఆ ఇద్దరిలో ఒకరు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కాగా మరొకరు డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు. విశాఖ నుంచి అనకాపల్లి వైపు మంత్రి అమర్నాథ్ కాన్వాయ్ వెళుటుండగా….లంకెల పాలెం దగ్గర ఓ బైక్ ప్రమాదానికి గురైనట్టు గమనించారు. వెంటనే కాన్వాయ్ ఆపి సొంత వాహనంలో బాధితులను ఆసుపత్రికి తరలించారు.
ఇక, రెండో ఘటనలో అంబులెన్స్ లో ఉన్న రోగి ప్రాణాలను కాపాడారు డిప్యూటీ సీఎం ముత్యాల నాయుడు. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి జిల్లాలో అడుగుపెట్టిన ముత్యాల నాయుడుకి ఎమ్మెల్యేలు,కార్యకర్తలు గ్రాండ్ వెల్ కం చెప్పారు. ఆయన ర్యాలీ నేషనల్ హైవే మీద వెళుతుండగా అనకాపల్లి-యలమంచిలి మధ్య అంబులెన్స్ చిక్కుకు పోయింది. దీంతో తాళ్లపాలెం దగ్గర స్వయంగా ముత్యాల నాయుడు పోలీసులను అప్రమత్తం చేశారు. ర్యాలీ ఆపించి మరీ అంబులెన్స్ ముందుకు వెళ్ళేందుకు క్లియరెన్స్ ఇప్పించారు. ఒకే రోజు ఇద్దరు మంత్రులు స్పందించిన తీరు ప్రశంసలు అందుకుంటోంది.