AP Mobile Alert: మొబైల్‌లో అలర్ట్ షాక్.? రేపు ఎన్నిగంటలకంటే..!

  • రాజధాని ప్రాంతంలో టెస్ట్ అలర్ట్ సందేశాలు రేపు
  • ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 12:15 వరకు ప్రసారం
  • బీప్, వైబ్రేషన్‌తో నోటిఫికేషన్.. భయపడొద్దు
  • అత్యవసర హెచ్చరికల కోసం సాంకేతిక పరీక్ష
Alert

Alert

AP Mobile Alert: ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతంలో రేపు మొబైల్ ఫోన్లకు టెస్ట్ అలర్ట్ సందేశాలు రానున్నాయి అని తెలిపింది రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ..దేశవ్యాప్తంగా అత్యవసర హెచ్చరికల వ్యవస్థను మరింత బలోపేతం చేసే భాగంగా జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ఈ పరీక్షను నిర్వహిస్తోంది.రేపు ఉదయం 11 గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 15 నిమిషాల మధ్య రాజధాని ప్రాంతాల్లో మొబైల్ ఫోన్లకు సెల్ బ్రాడ్‌కాస్ట్ టెస్ట్ అలర్ట్‌లు పంపనున్నారు. ఈ సమయంలో మీ మొబైల్‌లో బీప్ శబ్దం, వైబ్రేషన్‌తో కూడిన నోటిఫికేషన్ కనిపించవచ్చు.

ఈ సందేశంలో ఇది కేవలం పరీక్ష మాత్రమే, ఎలాంటి చర్య అవసరం లేదు అని తెలిపింది APSDMA. అధికారులు తెలిపిన మేరకు, ఇది పూర్తిగా సాంకేతిక పరీక్ష మాత్రమే. ప్రజలు ఎలాంటి భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రకృతి వైపరీత్యాలు లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో తక్షణ హెచ్చరికలను లక్షలాది మందికి వేగంగా చేరవేయడమే ఈ సెల్ బ్రాడ్‌కాస్ట్ వ్యవస్థ లక్ష్యం. అందువల్ల రేపు మొబైల్‌లో అలర్ట్ సందేశం వచ్చినప్పుడు భయపడకుండా ఉండాలని విపత్తు నిర్వహణ సంస్థ విజ్ఞప్తి చేసింది.