Site icon NTV Telugu

Minister Venugopal Krishna: చంద్రబాబు కుటిల కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారు..

Minister Venugopal Krishna

Minister Venugopal Krishna

Minister Venugopal Krishna: ఉత్తరాంధ్రలో పాదయాత్ర ద్వారా అక్కడ అశాంతిని సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ఆరోపించారు. అవాంఛనీయ సంఘటనలు జరిగితే చంద్రబాబు బాధ్యత వహించాలన్నారు. ఏ మొహం పెట్టుకుని ఉత్తరాంధ్ర వెళ్తున్నారన్న ఆయన.. పవన్ కళ్యాణ్ ఏమి మాట్లాడతాడో ఆయనకే తెలియదన్నారు. ఉత్తరాంధ్రలో అల్లర్లు, గొడవలు సృష్టించి లబ్ది పొందాలని చూస్తున్నారని.. వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉందన్నారు.

Botsa Satyanarayana: చంద్రబాబు మాదిరిగా సీఎం జగన్‌ మోసం చేయలేదు..

ప్రజలను రెచ్చగొట్టే పాదయాత్ర అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని మంత్రి పేర్కొన్నారు. మేనిఫెస్టో అంటే హామీలు ఇవ్వడమే.. అమలు చేయాల్సిన అవసరం లేదని చంద్రబాబు అనుకున్నాడని ఆయన విమర్శించారు. చంద్రబాబుకు ప్రజలను మోసం చేయడం, దోచుకోవడం, వారి మనుషులకు పంచిపెట్టడమే తెలుసన్నారు. అశాంతిని సృష్టించి ప్రజల దృష్టిని మరల్చి చంద్రబాబు అధికారంలోకి రావాలని అనుకుంటున్నాడని మంత్రి ఆరోపించారు. చంద్రబాబు కుటిల కుతంత్ర రాజకీయాలు చేస్తున్నారని మంత్రి వేణు విమర్శలు గుప్పించారు.

Exit mobile version