Site icon NTV Telugu

‘అరసవల్లి’ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్.. 10 రోజుల్లో..!

రథసప్తమి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.. అరసవల్లి దేవాలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ రూపొందించబోతున్నామని… దీనిపై పది రోజుల్లో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.. అరసవల్లి, శ్రీకూర్మం, శ్రీముఖలింగంలను కలుపుతూ టెంపుల్ టూరిజం అభివృద్ధికి వున్న అవకాశాలను పరిశీలిస్తామని తెలిపిన మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్… ఇక, అరసవల్లి సూర్యదేవుని జయంతి ఉత్సవాలును అధికారులు విజయవంతంగా నిర్వహించారిన ప్రశంసించారు.. మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఆరోగ్యం బాగుండాలని, రాష్ర్ట ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆ సూర్యనారాయణ స్వామిని కోరుకున్నట్టు తెలిపారు మంత్రి వెల్లంపల్లి. కాగా, రథసప్తమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతోంది అరసవల్లి సూర్యనారాయణస్వామి ఆలయం.

Read Also: గంగా నదిలో కోవిడ్‌ మృతదేహాలు.. కేంద్రం సమాధానం ఇదే..

Exit mobile version