Srikakulam Roja Dance: శ్రీకాకుళం జిల్లాలో శిల్పారామం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. రోజా వెల్లడించారు. 76 వ స్వాతంత్య్రం సందర్భంగా కళ్లేపల్లిలోని ఆనందోబ్రహ్మ, స్పిరిట్యువల్ టాబ్లెట్స్ వారిచే హంస ధ్వని తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా.. 12వ తేదీ నుండి 14 వరకు మూడు రోజుల పాటు ఏర్పాటు చేసిన కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా పర్యాటక శాఖ మంత్రి రోజా హాజరై హంసధ్వని పుస్తకాన్ని రోజా ఆవిష్కరించారు.
అనంతరం చామంతి పువ్వా పువ్వా… అనే పాటకు స్టెప్ లు వేసి జనాలను మంత్రి రోజా ఉత్సాహ పరుస్తూ.. వారితోపాటు మంత్రి రోజా స్టెప్పులు వేశారు. దీంతో ఆప్రాంతమంతా ఆటపాటలతో సంతోమయమైంది. మంత్రి రోజా ఎక్కడుంటే అక్కడ సందడే అనడానికి నిర్వచణంగా ఆప్రాంతమంతా నిదర్శనమైంది. అనంతరం మంత్రి రోజా మట్లాడుతూ.. ఎంతో చరిత్రకలిగిన శ్రీకాకుళం సంప్రదాయ గురుకుళంలో గత మూడు రోజులుగా జరుగుతున్న హంసధ్వని మెగా ఈవెంట్ లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. యావత్ భారత దేశమంతా ఘనంగా నిర్వహిస్తున్న ఆజాదీకా అమ్రుత్ మహోత్సవంలో భాగంగా ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు స్వాతి సోమనాథన్, జిల్లా కలెక్టర్, ఇతర అధికారులందరికీ ప్రత్యేకంగా అభినందించారు. మూడు రోజుల పాటు ధ్యాన, నాట్య, సంగీత ప్రదర్శనలను నిర్వహించేందుకు ఏర్పాటు చేసిన ఈ హంసధ్వని ద్వారా.. గొప్ప సందేశాన్ని ఇక్కడున్న ప్రజలకు అందించారని పేర్కొన్నారు.
మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంలో వజ్రోత్సవాలను మనం ఘనంగా నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఇలాంటి వజ్రోత్సవాలలో భాగంగా.. మన దేశంలోనే వజ్రం లాంటి సంప్రదాయ గురుకులంకి నేను రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈకార్యక్రమ ఉద్దేశం ధ్యానం మంచి ఆరోగ్యానికి సహకరించే సాధనా ప్రక్రియ అని రోజా పేర్కొన్నారు. అటువంటి ధ్యాన సంబంధ పిరమిడ్ల నిర్మాణానికి సహకరించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు మంత్రి రోజా. పోటీ ప్రపంచంలో.. మార్కుల కోసం, ర్యాంకుల కోసం పరుగుల తీస్తున్న పిల్లలకి, వారిలో ఒత్తిడిని వారు జయించడానికి ఇలాంటి మంచి కళలు, సంగీతం, నాట్యం. క్రీడల వైపు కాస్త ద్రుష్టి మల్లించేల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కోరుకుంటున్నానని రోజా తెలిపారు.
PM Narendra Modi: భారత్.. ప్రజాస్వామ్యానికి తల్లిలాంటిది
