Site icon NTV Telugu

Breaking: వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు.. సర్కార్‌ నిర్ణయం

Peddireddy

Peddireddy

వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లపై ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది.. కేంద్ర ప్రభుత్వ విధానాలు వ్యతిరేకిస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌.. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టేదేలేదని స్పష్టం చేశారు.. కానీ, ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు భిగించాలని నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం.. ఆరు నెలల్లో ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. శ్రీకాకుళం జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ కావటంతో మోటార్లు ఏర్పాటులో వేగం పెంచింది ప్రభుత్వం.. దీనిలో భాగంగా విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు 6 నెలల్లో మీటర్లు పెట్టనున్నట్టు వెల్లడించారు. వ్యవసాయ మీటర్ల ఏర్పాటుతో ఖచ్చితమైన విద్యుత్ వినియోగం తెలుస్తుందన్నారు.

Read Also: TikTok: స్పేస్‌ స్టేషన్‌లోనూ టిక్‌టాక్‌.. వైరల్‌

ఇక, రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రభుత్వ లక్ష్యంగా స్పష్టం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.. వ్యవసాయ విద్యుత్ మీటర్లపై ప్రతిపక్షాలది అసత్య ప్రచారమని కొట్టిపారేసిన ఆయన.. రైతులు వినియోగించిన విద్యుత్ చార్జీలను డీబీటీ కింద ప్రభుత్వం వారి బ్యాంకు ఖాతాలకే జమ చేస్తుందన్నారు. రైతులే నేరుగా డిస్కంలకు చెల్లింపులు జరుపుతారన్న ఆయన.. దీనివల్ల డిస్కంలలో జవాబుదారీతనం పెరుగుతుందన్నారు. ఈ నెలాఖరు నాటికి రైతులతో నూరుశాతం బ్యాంకు ఖాతాలు తెరిపించాలని స్పష్టం చేశారు. డీబీటీ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేసేందుకు డిస్కంలు సహకరించాలని సూచించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.

Exit mobile version