పొత్తులపై పరోక్ష వ్యాఖ్యలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పెంచారు.. అయితే, చంద్రబాబుపై కౌంటర్ ఎటాక్ దిగారు మంత్రి జోగి రమేష్.. చంద్రబాబుతో పాటు పవన్ కల్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. పొత్తుల కోసం చంద్రబాబు ఆరాటం, ప్యాకేజీ కోసం పవన్ కల్యాణ్ పోరాటం చేస్తున్నారు అంటూ ఆరోపణలు గుప్పించారు. ఎంత మంది కలిసినా 2024లో వచ్చేది వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమేననే నమ్మకాన్ని వ్యక్తం చేసిన ఆయన.. సింహం సింగిల్‌గానే వస్తుంది.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కూడా అంతే అన్నారు.
Read Also: Ayyanna Patrudu: అవంతికి అయ్యన్న కౌంటర్.. రాసలీలల ఆడియో తప్ప..!?
2014లో ముగ్గురు కలిసి పోటీ చేశారు, 2019లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలేలా ప్రయత్నించారు.. కానీ, పెద్ద ఎత్తున అభివృద్ధి, సంక్షేమం చేస్తున్న వైఎస్ జగన్ ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత ఎందుకు ఉంటుంది? అని ప్రశ్నించారు .. కానీ, ప్రజా వ్యతిరేకత చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పైనే ఉంటుందని వ్యాఖ్యానించారు మంత్రి జోగి రమేష్. కాగా, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ కలిసి రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాఉద్యమం రావాలని.. దానికి టీడీపీ నాయకత్వం వహిస్తుందన్న ఆయన..ఇక, ఈ పోరాటంలో తాము ఎలాంటి త్యాగానికైనా సిద్ధమని చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే.
