రోడ్డు ప్రమాదాలకు అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే వున్నాయి. దీంతో.. రోడ్డు ప్రమాదాల సంఖ్య పదుల సంఖ్యలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాంఘిక శాఖ మంత్రి మేరుగు నాగార్జున రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఇవాళ విజయవాడ వారధి నుంచి బందర్ రోడ్డు వైపు వస్తుండగా కారు ప్రమాదానికి గురైంది. దీంతో కారులో ఉన్న మంత్రికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో అక్కడికి చేరుకున్న అధికారులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మంత్రిని డిశ్చార్జ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
read also: Sourav Ganguly: దాదా రీఎంట్రీ.. ఛారిటీ మ్యాచ్ కోసం రంగంలోకి!
అయితే.. 2019లో జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వేమూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి.. 2022 ఏప్రిల్ 11న జరిగిన మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా వై. ఎస్. జగన్మోహన్ రెడ్డి మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై పోలీసులు ఆరాతీస్తున్నారు.
Iran: ఒకే రోజు ముగ్గురు మహిళలకు ఉరిశిక్ష.. వాళ్లు చేసిన నేరం ఏంటో తెలుసా..?