NTV Telugu Site icon

Gudivada Amarnath: జగన్‌కి సవాల్ చేయడమంటే.. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందు తొడకొట్టినట్లే

Gudivada Counter To Pawan

Gudivada Counter To Pawan

AP Minister Gudivada Amarnath Strong Counter To Pawan Kalyan Comments: తన వారాహి యాత్రలో భాగంగా ఏలూరు బహిరంగల సభలో జనసేనాధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి గుడివాడ అమర్నాథ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. సైకో ఫ్యాన్స్ తప్ప పవన్ వ్యాఖ్యలను ఎవరూ హర్షించరని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 2024లో ఏం చేయబోతున్నారో చెప్పకుండా.. కేవలం ముఖ్యమంత్రి జగన్‌పై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. ఎప్పుడూ చెప్పులు చూపిస్తున్న పవన్ తన వైఖరి మార్చుకోకపోతే.. జనం చెప్పులతో తిరగబడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. వారాహి సభలో పవన్ చెప్పిన లెక్కలు కాగ్‌వి కాదని, చంద్రబాబు ఇచ్చిన కాగితాలతో చెప్పిన కాకిలెక్కలని వ్యాఖ్యానించారు. ఎన్సీఆర్బీ నివేదికను కూడా స్పష్టంగా చెప్పలేని వ్యక్తి పవన్ అని ఎద్దేవా చేశారు.

Constable Fake Notes: దొంగనోట్ల కేసులో కానిస్టేబుల్.. ఒకటికి మూడు చొప్పున నకిలీ నోట్లు ఇస్తానని..

ముఖ్యమంత్రిని గౌరవించడం మానేస్తానంటున్న పవన్ తన మాటల్ని అదుపులో పెట్టుకోవాలని అమర్నాథ్ వార్నింగ్ ఇచ్చారు. అసలు ఏనాడూ గౌరవం ఇచ్చావని ఇప్పుడు గౌరవం ఇవ్వనంటున్నావని ప్రశ్నించారు. తనకు ప్యాకేజీ ఇచ్చే చంద్రబాబుకి తప్ప పవన్ ఇంకెవరికీ గౌరవం ఇవ్వడన్నారు. జగన్‌కి సవాల్ విసరడమంటే.. డిక్కీ బలిసిన కోడి చికెన్ షాప్ ముందుకు తొడకొట్టినట్టే అవుతుందన్నారు. అలా తొడగొడితే.. 2019లో జరిగిన పరిస్థితే 2024లో రిపీట్ అవుతుందన్నారు. అంటే.. వచ్చే ఎన్నికల్లోనూ పవన్‌కి ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. పవన్ హైదరాబాద్‌లో ఎంజాయి స్టార్ అయితే, ఏపీలో గంజాయి స్టార్ అంటూ ఆరోపణలు చేశారు. క్యారెక్టర్ అరిస్టులు, కమెడియన్లు ఎంపీలు, ఎమ్మెల్యేలు అవుతుంటే.. పవన్ ఎందుకు కాలేకపోయారని ప్రశ్నించారు. అందుకు కారణం.. పవన్ హావభావాలు, వైఖరేనని అన్నారు.

Homeguard Forgery Case: హోంగార్డు చేతివాటం.. ఫోర్జరీ సంతకాలతో నిధులు స్వాహా

తన ఇంట్లోని ఆడవాళ్లని టార్గెట్ చేశారని చెప్తున్న పవన్ కళ్యాణ్.. వైసీపీలో ఎవరైనా పవన్ తల్లిని గానీ, భార్యని గానీ అగౌరవపరిచినట్టు చూపించగలరా? అని అమర్నాథ్ సవాల్ విసిరారు. పవన్ తల్లిని అవమానించింది టీడీపీనే అని గుర్తు చేశారు. పేరులో కళ్యాణ్ పెట్టుకున్నందుకు.. నిత్య కళ్యాణాలతో సార్థకం చేసుకుంటున్నాడని చురకలంటించారు. ఎక్కడ తమకు తాళి కడతాడోనని రాష్ట్రంలోని అమ్మాయిలు పవన్ కళ్యాణ్‌ని చూసి భయపడుతున్నారని పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థని మోడీ ప్రశంసిస్తే, పవన్ మాత్రం విషం కక్కుతున్నారని ఫైరయ్యారు. దమ్ముంటే వాలంటీర్ వ్యవస్థని రద్దు చేస్తామని పవన్, చంద్రబాబు ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Jawan: రెండు నిమిషాల వీడియోతో ఇండియాస్ బిగ్గెస్ట్ సినిమా చూపించారు

పవన్ కళ్యాణ్ జనసేనాని కాదని, చంద్రబాబు సేనాధిపతి అని అమర్నాథ్ దుయ్యబట్టారు. చంద్రబాబు ప్యాకేజ్‌లతో నడుస్తున్న జనసేనను టీడీపీలో విలీనం చేస్తే మంచిదని హితవు పలికారు. బ్యానర్ అమ్మేస్తే ప్యాకేజీలు రావని, పవన్ అమ్మకానికి పెట్టడం లేదన్నారు. ఏం సాధించారని వారాహి విజయయాత్ర అంటూ సిరీస్‌లు చేస్తున్నారని నిలదీశారు. కనీసం ఎమ్మెల్యేగా గెలవడానికైనా పవన్ కళ్యాణ్ పని చేస్తే బెటరని సూచించారు. తాము అధికారంలోకి వస్తే, అన్ని పథకాలు రద్దు చేస్తామని చెప్పగలరా? అని ప్రశ్నించారు. ‘నిత్య పెళ్ళికొడుకు, ఇదే మా హెచ్చరిక, జనం తిరగబడే పరిస్థితి తెచ్చుకోవద్దు’ అంటూ అమర్నాథ్ హెచ్చరించారు.