NTV Telugu Site icon

Minister Gudivada Amarnath: చంద్రబాబులా పబ్లిసిటీ కాదు.. ప్రజలకు సాయం చేయాలన్నదే మా ఆలోచన..

Minister Gudivada Amarnath

Minister Gudivada Amarnath

ఆంధ్రప్రదేశ్‌లో వరదలపై కూడా బురద రాజకీయాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.. ఈ విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. వరదల్లో నష్టపోయిన ప్రజలను ఆదుకోవడానికి కృషి చేస్తున్నామని.. రూ.2 వేలతో పాటు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నామని అధికార పార్టీ చెబుతుంటే.. అదంతా వట్టిదే.. నాలుగు ఉల్లిగడ్డలు, నాలుగు బంగాళాదుంపలు, నాలుగు టమోటాలు ఇవ్వడం ఎంత వరకు? న్యాయం అంటూ టీడీపీ నిలదీస్తోంది.. అయితే, వరద ప్రభావి ప్రాంతాల్లో పర్యటిస్తూ.. బాధితులను పరామర్శిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. ఇవాళ ఉదయం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న మంత్రి అమర్‌నాథ్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చంద్రబాబులాగా పబ్లిసిటి ఆలోచన మాకు లేదు.. ప్రజలకు సహాయం చేయాలన్నదే ఆలోచన అని స్పష్టం చేశారు..

Read Also: CBSE 12th Result 2022: CBSE 12 వ తరగతి పలితాలు విడుదల.. 92.71 శాతం ఉత్తీర్ణత

భారతదేశంలో అత్యధిక తీర ప్రాంతం కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌.. కానీ, పేదవాడికి మంచి చేయాలన్న ఆలోచన లేదని వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు మంత్రి అమర్‌నాథ్.. వైజాగ్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌లో ఐటీ అభివృద్దిపై దృష్టి సారించామని తెలిపారు.. వైజాగ్, విజయవాడ, తిరుపతి కేంద్రాలలో ఐటీ రంగాని విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు.. ఇక, వరద సమయంలో ప్రతీ కుటుంబానికి 2 వేల నగదుతో పాటు నిత్యావసరాలు అందించామని తెలిపారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌.. కాగా, గోదావరి వరద ఉధృతితో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో చంద్రబాబుపై కౌంటర్‌ ఎటాక్‌కు దిగారు మంత్రి అమర్‌నాథ్‌.