Site icon NTV Telugu

Botsa Satyanarayana: కేటీఆర్ తన వ్యాఖ్యలను విత్‌డ్రా చేసుకోవాలి..

Botsa Satyanarayana

Botsa Satyanarayana

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్లు, కరెంట్‌ లాంటి సమస్యలపై తెలంగాణ మంత్రి కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలు ఏపీలో పొలిటికల్‌ హీట్‌ పెంచాయి.. దీంతో, కేటీఆర్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీ మంత్రలు.. కేటీఆర్‌ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చిన ఆయన.. చాలా సున్నితమైన అంశం, కేటీఆర్ చెప్పినట్టు అయితే మనం రోడ్డు మీద నిలబడి మాట్లాడడం లేదా? అని ప్రశ్నించారు. ఆయనకు ఆయన ఫ్రెండ్ చెప్పాడు.. నేను హైదరాబాద్‌లో ఉండి వస్తున్నా.. అక్కడ కరెంటే లేదు, నేను కూడా అక్కడ జనరేటర్ పెట్టుకుని ఉండాల్సి వచ్చిందన్నారు. కావాలంటే వారి ఘనత వారు చెప్పుకోవచ్చు.. అంతేగానీ ఇలా అంటారా అంటూ తీవ్రంగా ఆక్షేపించారు. భాద్యత గల వ్యక్తులు అలా మాట్లాడొచ్చా? అని ప్రశ్నించిన మంత్రి బొత్స.. కేటీఆర్ తన వ్యాఖ్యలను విత్ డ్రా చేసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Read Also: Karishma Kapoor: రెండో పెళ్లికి సిద్ధమంటున్న కపూర్ గాళ్

ఇక, ఏపీలో పదోతరగతి ప్రశ్నాపత్రాలు సోషల్ మీడియాలో బయటకు వస్తుండడంపై మురోసారి స్పందించిన మంత్రి బొత్స.. నంద్యాలలోను పేపర్‌ బయటకు రావడం పుకారు మాత్రమే అన్నారు. సత్యసాయిలో 12.15కి పేపర్ బయటకు వచ్చిందన్నారు. ఇందులో ఏంజరిగిందో అరగంటలో అన్ని వివరాలు వెల్లడిస్తాం అన్నారు. మీడియాలో 10 గంటలకే బయటకు వచ్చింది అంటున్నారు. వాస్తావాలు ఏంటో ఎంక్వైరీ చేస్తామన్న ఆయన.. టెక్నాలిజీ పెరిగిపోయిన తరువాత ఒకరికోసమో ఇద్దరి కోసమో, ఒక రూం లోని వారికోసమో కుట్రతో చేస్తున్నారు. దాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాం అన్నారు. దీనిపై ప్రైవేటు కాలేజీలకు ఆపాదించలేం.. ఎక్కడ ఏ చిన్న అంశం జరిగినా సరే వారిని అదుపులోకి తీసుకుంటాం అన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

Exit mobile version