NTV Telugu Site icon

కొత్త జిల్లాలపై కూడా చంద్రబాబు కోర్టుకి వెళ్తాడు.. ఏపీ మంత్రి సెటైర్లు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేష‌న్ జారీ చేసిన ప్ర‌భుత్వం.. అభ్యంత‌రాల‌ను స్వీక‌రిస్తోంది.. కొత్త జిల్లా కేంద్రాలు, పేర్ల‌పై ప‌లు విమ‌ర్శ‌లు, విజ్ఞ‌ప్తులు వ‌స్తున్నాయి.. కొంద‌రి నుంచి ప్ర‌శంస‌లు కూడా ల‌భిస్తున్నాయి.. అయితే, కొత్త జిల్లాల విష‌యంలో టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై సెటైర్లు వేశారు మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. ప్ర‌కాశం జిల్లాలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయ‌న‌.. కృష్ణా జిల్లాని ఎన్టీఆర్ జిల్లాగా మార్చడం అభినందనీయం అన్నారు.. ఎన్టీఆర్ పేరుని చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు విస్మరించార‌ని మండిప‌డ్డ ఆయ‌న‌.. బీజేపీతో కలిసి ఉన్నప్పుడు ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని చంద్రబాబు ఎందుకు అడ‌గ‌లేద‌ని నిల‌దీశారు.. ఇక‌, కొత్త జిల్లాలపై కూడా చంద్రబాబు కోర్టుకి వెళ్తాడు అంటూ ఎద్దేవా చేశారు.. కోర్టుని అడ్డం పెట్టుకుని రాజకీయం చేసే ఘనుడు చంద్రబాబు అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు మంత్రి బాలినేని శ్రీ‌నివాస్‌రెడ్డి.

Read Also: ఏపీ ఉద్యోగుల స‌మ్మె.. వారిపై చ‌ర్య‌ల‌కు ఆర్థిక శాఖ ఆదేశాలు