NTV Telugu Site icon

కేసీఆర్‌పై ఏపీ మంత్రి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్‌రావుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు ఏపీ మంత్రి ఆదిమూల‌పు సురేష్.. కేసీఆర్‌.. ఈ మ‌ధ్య రాజ్యాంగంపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర వివాదాస్పద‌మైన విష‌యం తెలిసిందే కాగా.. ఇవాళ తాడేప‌ల్లిలో ఏపీ ఎస్సీ, ఎస్టీ గెజిటెడ్ అధికారుల సంక్షేమ సంఘం డైరీ ఆవిష్కరణ కార్య‌క్ర‌మంలో.. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, ప్రభుత్వ సలహాదారు సజ్జలతో క‌లిసి పాల్గొన్న మంత్రి ఆదిమూల‌పు సురేష్.. కేసీఆర్‌పై విరుచుకుప‌డ్డారు.. కొంత మంది కుహనా మేధావులు రాజ్యాంగం మార్చాలని అంటున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన ఆయ‌న‌.. రాజ్యాంగంలోని ఏ అంశం వాళ్ల‌ను అంతలా కలచివేచేలా చేస్తోందో? అని అనుమానాన్ని వ్య‌క్తం చేశారు.. ఈ వ్యాఖ్యలు దళితుల ఆత్మ గౌరవాన్ని దెబ్బ తీస్తున్నాయ‌న్న ఆయ‌న‌.. సఫాయి ఉద్యోగాలు దళితులు తప్ప ఎవరు చేస్తారు? అని ప్ర‌శ్నించారు.. మ‌రోవైపు.. పీఆర్సీ ఆందోళ‌న‌ల‌పై స్పందించిన మంత్రి సురేష్.. పీఆర్సీకి సంబంధించి ఒక మెలిక పడింది.. ముఖ్యమంత్రి పై మాకు నమ్మకం ఉంది.. చర్చలకు వెళ్ల‌టంలో తప్పు లేదని మీరు కూడా చెప్పండి అని సూచించారు.

Read Also: నేను అప్పుడే జగన్ పాదాలకు దండం పెట్టా- డిప్యూటీ సీఎం