NTV Telugu Site icon

AP Health Department: వైరల్ ఫీవర్స్, వడదెబ్బపై అప్రమత్తం.. జూమ్ ద్వారా మంత్రి రజిని సమీక్ష

Ap Health Meeting

Ap Health Meeting

AP Medical Health Department Zoom Meeting In Viral Fevers And Sunstroke: ఆంధ్రప్రదేశ్‌లో వైరల్ ఫీవర్స్, వడదెబ్బలపై వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. ఈ అంశాలపై జూమ్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజిని సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఉన్నతాధికారులు, 26 జిల్లాల DM&HOలు, 16 GGHల సూపరింటెండెంట్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా.. ఇన్ఫ్లుయంజా వైరస్, వడదెబ్బపై కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు రాష్ట్రంలో అప్రమత్తంగా ఉన్నామని కృష్ణబాబు స్పష్టం చేశారు. విలేజ్ హెల్త్ క్లినిక్‌ల స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామన్న ఆయన.. ఏర్పాట్లపై డిఎంహెచ్ఓలకు పలు ఆదేశాలు ఇచ్చారు. తక్షణమే వారం రోజులపాటు ఫీవర్ సర్వే చేపట్టాలని నిర్ణయించారు. వడదెబ్బకు గురికాకుండా ప్రజల్ని కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వీలైతే స్వచ్ఛంద సేవా సంస్థల్ని వినియోగించుకోవాలని సూచించారు.

Phone charger in socket: మొబైల్ చార్జర్ ఎన్ని యూనిట్ల కరెంట్ వినియోగిస్తుందో తెలుసా?

ఎండ వేడిమి ఎక్కువగా ఉన్న సమయంలో ప్రజలు బయట తిరగకుండా ఉండేలా అలర్ట్ చేయాలని కృష్ణబాబు తెలిపారు. ప్రజల్లో పెద్దఎత్తున అవగాహన కల్పించాలని, జిల్లా కలెక్టర్లతో డిఎంహెచ్ఓలు సమన్వయం చేసుకోవాలని చెప్పారు. ఎన్జీవోలతో కలెక్టర్లు సమావేశాన్ని ఏర్పాటు చేసేలా డిఎంహెచ్‌ఓలు చొరవ తీసుకోవాలన్నారు. శీతల నీటి కేంద్రాలు ఏర్పాటు చేయడంతో పాటు ఓఆర్ఎస్ ప్యాకెట్లు విలేజ్ క్లినిక్‌ల స్థాయిలో సిద్ధం చేసుకోవాలన్నారు. ఎన్ఆర్‌జీయస్ క్యాంపుల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, డీహైడ్రేషన్‌కు గురికాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఐవీ ఫ్లూయిడ్స్ ఎక్కించే విషయంలో ఎమ్ఎల్‌హెచ్‌పీలకు తగిన శిక్షణ ఇవ్వాలని.. ఎంఎల్‌హెచ్‌పీలు , ఎఎన్ఎంలు సమన్వంతో పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వారం రోజుల్లోగా ఫీవర్ సర్వే పూర్తి చేసేలా డిఎంహెచ్ఓలు తక్షణమే రంగంలోకి దిగాలని, అవసరమైతే విలేజ్ వాలంటీర్ల సేవల్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు. బహిరంగ ప్రదేశాలు, జన సమ్మర్ధ ప్రాంతాల్లో మాస్కులు పెట్టుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాలేజీలు, స్కూళ్లలో పరిస్థితులను అనుసరించి.. తగిన చర్యలు తీసుకునేలా ఆయా శాఖలకు పలు సూచనలు ఇచ్చారు.

Xi Jinping: యుద్ధాలను గెలవడానికి వ్యూహాలు రచించండి .. సైన్యానికి జిన్ పింగ్ దిశానిర్దేశం..

ఈనెల 14న రాష్ట్రంలో నేషనల్ డీవార్మింగ్ డే ఏర్పాట్లపై కూడా కృష్ణబాబు పలు సూచనలిచ్చారు. రక్తహీనత నివారణలో భాగంగా నులిపురుగుల నిర్వహణ అత్యంత అవసరమని తెలిపారు. రెండు రోజుల ముందుగానే నులిపురుగుల మాత్రలు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశాలిచ్చారు. తక్షణమే లక్ష సికిల్ సెల్ కిట్లు అందుబాటులోకి తేవాలన్నారు. ఈనెలలో 3 లక్షల సికిల్ సెల్ అనీమియా కిట్ల పంపిణీ లక్ష్యంగా పని చేయాలన్నారు. సికిల్ సెల్ అనీమియా పేషంట్‌లకు కార్డుల జారీకి చర్యలు చేపట్టాలన్నారు. సిజేరియన్ ఆపరేషన్లపై కలెక్టర్లు జిల్లా స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసేలా డిఎంహెచ్ఓలు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. నోటిఫైబుల్ వ్యాధుల నమోదు విషయంలో ప్రైవేటు ఆసుపత్రులపై నిరంతర పర్యవేక్షణ వుండాలని.. డిఎంహెచ్ఓలు విజిట్ చేసి పరిశీలించాలని.. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు అప్లోడ్ చేస్తున్నది, లేనిది కూడా పరిశీలించాలని సూచించారు.

Online Fraud: లాభాలొస్తాయని నమ్మించి.. నిండా దోచేశారు