Site icon NTV Telugu

AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాం ఛార్జ్షీట్లో జగన్ పేరు.. నేడు జడ్జి ముందుకు మిథున్ రెడ్డి..!

Mithunreddy

Mithunreddy

AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో సంచలనం రేపిన లిక్కర్ స్కాం కేసులో నాటకీయ పరిణామాలు జరుగుతున్నాయి. ఈ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి‌ని సిట్ అధికారులు శనివారం సాయంత్రం అరెస్ట్ చేసింది. అయితే, ఈ రోజు ఆయనను జడ్జి ఎదుట హాజరుపర్చనున్నారు. మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టును అభ్యర్థించనున్నారు. ఇక, తాజాగా దాఖలైన ఛార్జ్‌షీట్ లో మరిన్ని కీలక విషయాలను వెలుగులోకి తీసుకొచ్చింది. మొత్తం 305 పేజీలతో కూడిన ఈ ఛార్జ్‌షీట్‌లో మరో 48 మందిని నిందితులుగా పేర్కొనింది. ఇందులో కొత్తగా ఇంకో 8 మందిని సిట్ చేర్చింది. ఈ ఛార్జ్‌షీట్‌లో 16 మంది పాత్రపై స్పష్టమైన అభియోగాలను సిట్ అధికారులు నమోదు చేశారు.

Read Also: Big Breaking: భారత్‌-పాకిస్తాన్ మ్యాచ్‌ రద్దు.. శిఖర్ ధావన్‌ కీలక వ్యాఖ్యలు!

అయితే, ఈ కేసుకు సంబంధించి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును కూడా ఛార్జ్‌షీట్‌లో సిట్ ప్రస్తావించింది. ముఖ్యంగా లిక్కర్ పాలసీ రూపకల్పన, ఆ పాలసీ అమలులో తీసుకున్న నిర్ణయాలు జగన్ కు తెలుసు అనే ప్రస్తావనకు వచ్చింది. కాగా, ఆయనను నిందితుడిగా మాత్రం చేర్చలేదు. జగన్ పాత్రపై పూర్తి విచారణ తర్వాత నిర్ణయం తీసుకుంటామని అధికారులు తెలియజేసినట్లు సమాచారం.

Read Also: Farah Khan : ప్రీమియర్ షో లో షారుక్, దీపిక డీప్ స్లీప్.. ఫరాఖాన్ రివీల్ చేసిన షాక్‌ స్టోరి

తాజాగా ఛార్జ్‌షీట్‌లో నిందితులుగా చేర్చిన 8 మంది వివరాలు:

* అనిరుధ్ రెడ్డి
* బొల్లారం శివకుమార్
* సైమన్ ప్రసన్
* రాజీవ్ ప్రతాప్
* కొమ్మారెడ్డి అవినాష్ రెడ్డి
* మోహన్ కుమార్
* అనిల్ కుమార్ రెడ్డి
* సుజల్ బెహ్రూన్

Exit mobile version